అమెరికాలో మరో విషాదకర ఘటన తెలుగు కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి తన స్నేహితుల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో తాను ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది.
నల్గొండ జిల్లాకు చెందిన అనురూప్ రెడ్డి కొడూరు (22) ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మే 29న స్నేహితులతో కలిసి టెక్సాస్, లూసియానా సరిహద్దులోని టోలెడో బెండ్ రిజర్వాయర్ ప్రాంతానికి వెళ్లాడు.
ఈ సందర్భంగా నీటిలో ముగ్గురు స్నేహితులు ప్రమాదంలో చిక్కుకోవడంతో అనురూప్ వెంటనే వారిని రక్షించేందుకు దూకాడు. అద్భుత ధైర్యసాహసాలు చూపించి ముగ్గురినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. కానీ అదే సమయంలో నీటి అడుగున ఉన్న ఫిషింగ్ వైర్ అతని కాళ్లకు చిక్కుకుంది.
బలమైన నీటి ప్రవాహం కారణంగా బయటపడలేకపోయిన అనురూప్ నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు గంటల తరబడి గాలింపు చేపట్టి చివరకు అతని మృతదేహాన్ని సుమారు 20 అడుగుల లోతులో గుర్తించాయి.
అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల మరణ వార్తలు తరచూ వినిపిస్తున్న వేళ ఈ ఘటన మరింత బాధ కలిగిస్తోంది. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన అనురూప్ ధైర్యం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, యూనివర్సిటీ వర్గాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
This post was last modified on May 31, 2026 12:08 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…