Movie News

అజిత్ ఇంటికి సీఎం విజయ్, కానీ ట్విస్టేంటంటే…

తమిళ అగ్ర కథాానాయకుల్లో ఒకరైన అజిత్ కుమార్‌కు నిన్న మాతృ వియోగం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని మణి 85 ఏళ్ల వయసులో శనివారం మృతి చెందారు. అజిత్ కుటుంబంలో ఎంతో కీలకమైన వ్యక్తి మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇండస్ట్రీ ప్రముఖులందరూ అజిత్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.

దశాబ్దాలుగా అజిత్‌కు పోటీ హీరోగా ఉన్న విజయ్, ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి మోహిని మణికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ క్యాజువల్ లుక్‌లోనే విజయ్.. అజిత్ ఇంటికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం భద్రత సిబ్బంది సైతం ఆయన ఇంటికి వెళ్లారు. ఐతే విజయ్‌తో పాటుగా త్రిష కూడా అజిత్ ఇంటికి వెళ్లడం గమనార్హం.

విజయ్ తన భార్య సంగీత నుంచి కొన్నేళ్లుగా దూరంగా ఉండగా.. త్రిష అతడితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అజిత్ ఇంటికి విజయ్‌తో పాటుగా త్రిష వెళ్లింది. ఎన్నికలకు ముందు విజయ్ త్రిషతో కలిసి ఒక పెళ్లికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. వాళ్లిద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం అదే తొలిసారి. సీఎం అయ్యాక మళ్లీ ఇప్పుడు తొలిసారిగా ఇద్దరూ కలిసి ఇలా దర్శనమిచ్చారు.

ఇంటి నుంచి బయటికి వచ్చి వీళ్లిద్దరినీ రిసీవ్ చేసుకున్నాడు అజిత్. ఈ సందర్భంగా అజిత్‌ను విజయ్ హత్తుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. విజయ్, అజిత్ అభిమానులు బయట శత్రువుల్లా వ్యవహరిస్తారు కానీ.. ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి స్నేహమే ఉంది. ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటారు. విజయ్ తన ప్రసంగాల్లో తరచుగా అజిత్ పేరు ప్రస్తావిస్తుంటారు కూడా.

This post was last modified on May 31, 2026 11:40 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago