ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నాను అంటూ టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగుతున్న తొలి మహానాడు సందర్భంగా లోకేశ్ చేయబోతున్న ఆ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
ఈ క్రమంలోనే తన తాత ఎన్టీఆర్, తండ్రి సీబీఎన్ బాటలోనే మహిళలకు పెద్దపీట వేసేలాగా లోకేశ్ ఆ ప్రకటన చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా టీడీపీ మహిళలకు కనీసం 33% సీట్లు రిజర్వ్ చేయాలని తాను ప్రతిపాదిస్తున్నానని అన్నారు. మహిళలకు 33 శాతం సీట్లు టీడీపీ కేటాయించాలని ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నానని తెలిపారు.
పార్లమెంటులో ఇటీవల మహిళల రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టారని, ఆ బిల్లులకు ఎన్డీఏ మిత్రపక్షాలలో ఒకటిగా టీడీపీ మద్దతిచ్చిందని లోకేశ్ గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు ఆ బిల్లులను అడ్డుకున్నాయని అన్నారు.
అందుకే, మరోసారి బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే, అక్కడ బిల్లు పాస్ అయినా కాకున్నా…ఏపీలో మాత్రం టీడీపీ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని తాను ప్రతిపాదిస్తున్నానని అన్నారు.
This post was last modified on May 27, 2026 1:12 pm
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…