నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు ప్రీమియర్ వేసినప్పుడు వచ్చిన మిశ్రమ స్పందనకు, ప్రతి షోకు పెరుగుతూ వెళ్లిన కలెక్షన్లకు పొంతన లేకుండా పోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇలాంటి ప్రేమకథలకు రెస్పాన్స్ తక్కువగా ఉండే సీడెడ్ లాంటి మాస్ సెంటర్స్ లోనూ మంచి నెంబర్లు నమోదు చేయడం చిన్న విషయం కాదు. సోమవారం దాకా జోరు బాగానే ఉంది.
ఇవాళో రేపో యాభై కోట్ల మార్కు అందుకునేలానే కనిపిస్తోంది. అయితే ఈ జోరు రెండో వీకెండ్ కూడా కొనసాగుతుందా లేదానే దాని మీదే బయ్యర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫీవర్ మాములుగా లేదు. టికెట్ల కోసం యుద్ధాలే జరుగుతున్నాయి. షోలు ఎక్కడ పెట్టినా నిమిషాల్లో అమ్ముడుపోతున్నాయి. దీని దెబ్బకు చెన్నై లవ్ స్టోరీ రెండో వారం అగ్రిమెంట్లు చేసుకున్న స్క్రీన్లకు ఓవర్ ఫ్లోస్ వల్ల ప్లస్ అవ్వొచ్చనే అంచనా లేకపోలేదు.
ఒకవేళ చెన్నై లవ్ స్టోరీ నెమ్మదించినా నష్టమేం లేదు. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వెళ్తోంది. సో స్పైడర్ మ్యాన్ వల్ల ఎఫెక్ట్ ఏదైనా ఉంటే అది కొత్తగా రిలీజవుతున్న శ్రీనివాస మంగాపురం, న్యూటన్స్ థర్డ్ లాకు తప్ప దీనికి కాదనేది కిరణ్ అభిమానుల అభిప్రాయం. ప్రమోషన్స్ పరంగా టీమ్ తన పనిని దాదాపుగా పూర్తి చేసేసింది. చిరంజీవి అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్, నాగ చైతన్య గెస్టుగా సక్సెస్ మీట్ అయిపోయాయి. ఇంతకన్నా పెద్దవి ఇక ఉండవు
నెక్స్ట్ బాక్సాఫిస్ రన్ చూస్తూ ఉండటం తప్ప చెన్నై బృందానికి పెద్దగా పనుండక పోవచ్చు. అయినా సరే థియేటర్ విజిట్స్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారట. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియాతో పాటు టీమ్ ఆల్రెడీ ప్రకాశం సైడ్ వెళ్ళిపోగా తర్వాతి లిస్టులో రాయలసీమ జిల్లాలు ఉన్నాయట. హీరో స్వంత ప్రాంతం కాబట్టి అక్కడేదైనా స్పెషల్ పబ్లిసిటీ చేస్తారేమో. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ డ్రామాకు సాయి రాజేష్ నిర్మాణం ప్లస్ రచన చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 29, 2026 2:50 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…