అదేంటో ఏ ముహూర్తంలో అనుకున్నారో కానీ ఎల్లమ్మ సినిమాకు అవాంతరాలు, వాయిదాలు తప్పడం లేదు. నాని నుంచి నితిన్ కి వెళ్లి వాళ్ళిద్దరి చేయి జారాక చివరికి దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా మార్చిన ఈ మూవీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు. ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది కానీ షెడ్యూల్స్ వేసుకుని సెట్స్ మీదకు వెళ్లే పనిని దర్శకుడు వేణు యెల్దండి త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ఇంత లేట్ కావడానికి ప్రధాన కారణం హీరోయిన్ ఎంపికన్న సంగతి తెలిసిందే.
మొదట్లో సాయిపల్లవి పేరు వినిపించింది. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ అన్నారు. ఒకదశలో శ్రీలీలని కూడా తెరమీదకు తెచ్చారు. కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అన్నారు. కానీ వీళ్ళెవరూ ఎల్లమ్మ చేయడం లేదు. కారణం హీరో మార్పా లేక మరొకటా అనేది చెప్పలేం కానీ ఇప్పుడీ బంతి మమిత బైజు దగ్గర ఆగిందని వినికిడి. కథ బాగా నచ్చిందని, చేసేది లేనిది త్వరగా చెబుతునని అన్నట్టుగా వచ్చిన వార్త ఒకరకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఖరారైతే హ్యాపీనే.
ప్రేమలు బ్లాక్ బస్టర్ తర్వాత మమిత బైజు కేవలం యూత్ పాత్రలు చేయాలని మడికట్టుకోలేదు. ఈ మధ్యే ధనుష్ కరలో పల్లెటూరి యువతిగా చాలా సీరియస్ రోల్ చేసింది. విశ్వనాథ్ అండ్ సన్స్ లో నలభై ఏళ్ళ వయసున్న సూర్యని ప్రేమించే టీనేజర్ గా ఇంకో రిస్క్ చేసింది. సో ఎల్లమ్మకు తను మంచి ఛాయస్ అవ్వొచ్చు. దేవి హీరో అయినప్పటికీ హీరోయిన్ కి చాలా ప్రాధాన్యం ఉందట. డబ్బింగ్ తో మేనేజ్ చేయడం కాకుండా ఇంటెన్స్ యాక్షన్ డిమాండ్ చేసే పాత్రట.
నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇంత లేట్ అవుతున్నా సరే స్క్రిప్ట్ మీద నమ్మకంతో పట్టు వదలకుండా వేణుని తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. ఒకవేళ నాని ఒప్పుకుని ఉంటే ఈపాటికి రిలీజైపోయి దసరాని మించిన పేరు తెచ్చేదని కథ విన్నవాళ్ళు అంటున్నారు. అదే నిజమైన పక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కి హీరోగా కూడా బ్లాక్ బస్టర్ దక్కినట్టే. నిన్న ఎల్లమ్మకు సంబంధించి దేవి స్వంత ఊరు వీడియో అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
This post was last modified on May 27, 2026 1:30 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…