కన్నడ నాట మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోందని, ఈ సమావేశంలో ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి దించేసి… చాన్నాళ్లుగా ఆ పదవి కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు అప్పగించే దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయంటూ ఆ వార్తలు చెబుతున్నాయి.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో పార్టీలో కీలక నేతగా ఎదిగిన డీకే శివకుమార్ కీలక భూమిక పోషించారని, ఈ కారణంగానే పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో విజయం సాధించిందని నాడు కాంగ్రెస్ భావించింది. అయితే అప్పటికే సీఎంగా కొనసాగుతున్న సిద్ధరామయ్య…మరోమారు తానే సీఎంగా ఉంటానని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు రెండున్నరేళ్ల పాటు సీఎంగా కొనసాగేలా ఓ ఒప్పందం జరిగిందని వార్తలు వినిపించాయి.
2023 ఎన్నికల్లో విజయం తర్వాత మరోమారు సీఎంగా అవకాశం దక్కించుకున్న సిద్ధరామయ్య ఇప్పటికే తన రెండున్నరేళ్ల పదవీ కాలాన్ని ముగించుకున్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యను దించేసి సీఎం పీఠాన్ని తనకు అప్పగించాలని డీకే పలుమార్లు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీనిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించలేకపోయింది. ఆ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు డీకే మరోమారు అధిష్ఠానానికి ఈ విషయాన్ని గుర్తు చేసినట్టు సమాచారం. దీనిపై మరింత సాగదీత తగదన్న రీతిలో అధిష్ఠానం చర్యలు చేపట్టిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
తక్షణమే ఢిల్లీ రావాలంటూ సిద్ధరామయ్యకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి సందేశం వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా సిద్ధరామయ్యే వెల్లడించారు. అయితే విషయం ఏమిటన్న దానిని సిద్ధరామయ్య వెల్లడించలేదు. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సిద్ధరామయ్య…మంగళవారం ఉదయం 11 గంటలకు కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు.
ఈ భేటీలోనే సీఎం మార్పు దిశగా కీలక చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. రెండున్నరేళ్లకు బదులుగా మూడేళ్ల పాటు సీఎంగా ఉన్నారు కదా… ఇక డీకేకు అవకాశం కల్పిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం సిద్ధరామయ్యను కోరనున్నట్టు సమాచారం. మరి ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య ఏమంటారో… సిద్ధరామయ్య స్పందనపై అదిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on May 25, 2026 9:37 pm
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…