Movie News

బన్నీ తర్వాత చరణ్ సాధించగలడా

పెద్ది ప్రమోషన్లలో భాగంగా దానికి పని చేసినవాళ్లు, నటించిన వాళ్ళు ఎవరిని కదిపినా అధిక శాతం వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఒకటుంది. అదే రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు రావడం. క్లైమాక్స్ అయిపోయి బయటికి వచ్చాక ఎమోషన్ వెంటాడుతూనే ఉంటుందని, తన పెర్ఫార్మన్స్ కు ఫిదా కావడం ఖాయమని కెమెరామెన్ రత్నవేలు, దర్శకుడు బుచ్చిబాబు పదే పదే నొక్కి చెబుతూ వచ్చారు. కన్నడ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న శివరాజ్ కుమార్ కూడా ఇదే చెబుతున్నారు.

నిజానికి తెలుగు సినిమా హీరోలకు జాతీయ అవార్డనేది ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయింది. దాన్ని అల్లు అర్జున్ అందుకున్నాడు. పుష్పకు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళలోనూ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలివేషన్ ఆధారంగా చేసే సినిమాలు ఎక్కువైపోవడంతో నటనకు స్కోప్ దొరకడం లేదు. అందుకే రంగస్థలం, ఆర్ఆర్ఆర్, పెద్ది, మహానటి, సైరా, శాతకర్ణి లాంటివి అరుదుగా వస్తుంటాయి. వాటిని సరైన రీతిలో వాడుకోవడమే కావాల్సింది.

ట్రైలర్ తో బజ్ పెరిగిందా తగ్గిందా అనేది పక్కన పెడితే రామ్ చరణ్ ఇంటెన్స్ నటన ఆకట్టుకోవడం పక్కాని అనిపిస్తోంది. గేమ్ ఛేంజర్ తీవ్రంగా నిరాశ పరిచాక మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. మూడేళ్ళ కష్టం దర్శకుడు శంకర్ వృధా చేయడంతో ఆ బాకీ తీర్చాల్సిన బాధ్యత బుచ్చిబాబు మీద ఉంది. దానికి తగ్గట్టే ఇప్పటిదాకా వదిలిన కంటెంట్ ప్రామిసింగ్ గా అనిపించింది. అంచనాలు నిలబెట్టుకుంటే కనక ఆకాశమే హద్దవుతుంది.

జూన్ 4 ఎంతో దూరంలో లేదు. ఫ్యాన్స్ టెన్షన్ క్రమంగా పెరుగుతోంది. అసలే బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో వస్తుండటంతో ఇది కనక క్లిక్ అయితే రికార్డుల వేట మాములుగా ఉండదు. జాతీయ అవార్డు రావడం రాకపోవడం ఏడాది తర్వాత మాట కానీ ముందైతే బ్లాక్ బస్టర్ సాధిస్తే మెగాభిమానులు రిలాక్స్ అవుతారు. ఎందుకంటే చరణ్ నెక్స్ట్ మూవీ ఇప్పుడప్పుడే లేదు. సుకుమార్ షూటింగ్ మొదలుపెట్టాక ఎంతలేదన్నా వెయిటింగ్ పీరియడ్ రెండు సంవత్సరాలు పెట్టుకోవాల్సిందే.

This post was last modified on May 25, 2026 9:22 pm

Share

Recent Posts

ఇరుముడి… క్రిష్‌కు ఇంకా బాకీ!

‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…

42 minutes ago

అన్న రాలేదు.. వదినమ్మ ఒక్కరే ఎందుకు?

విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్‌కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…

3 hours ago

మహాకాళి ముందు జాగ్రత్త పడుతోంది

హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…

3 hours ago

రాజకీయాలకు అయ్యన్న గుడ్ బై

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…

4 hours ago

ప్రభాస్ ఓడిన జానర్లో రవితేజ గెలవాలి

ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…

5 hours ago

విజయశాంతికి బెర్త్ ఖరారు?

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖరారైనట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల మంత్రి…

6 hours ago