ప్రభాస్ ఫౌజీ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ఆ గాయాన్ని పూర్తిగా పోగొట్టే బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకమంతా దర్శకుడు హను రాఘవపూడి మీద పెట్టారు. అయితే పలు వాయిదాల తర్వాత డిసెంబర్ 3 విడుదల తేదీని ఫైనల్ గా లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ డేట్ అందుకోవడం కష్టమని, అప్పటికంతా అన్ని పనులు అయ్యేలా లేవని ఏవేవో ప్రచారాలు మొదలైపోయాయి. వాటిలో ట్విస్టులు కూడా ఉన్నాయి.
మొదటిది ఏంటంటే ఒకవేళ ఫౌజీ కనక డిసెంబర్ మొదటి వారం నుంచి తప్పుకుంటే కనక ఆ స్థానంలో విజయ్ దేవరకొండ రణబాలి వస్తుందట. ఇది కూడా మైత్రి ప్రొడక్షనే. అక్టోబర్ చివరి వారం అంటూ తిరిగిన వార్త నిజం కాకపోవచ్చనేది దాని సారాంశం,. ఒకవేళ రణబాలి అక్టోబర్ లో వచ్చి, ఫౌజీ డిసెంబర్ లో రాకపోతే అప్పుడు నాగచైతన్య వృషకర్మని అదే తేదీకి దింపాలనేది మరో ప్లానట. ఏదీ నిర్ధారణ కాకుండా ఒకదానికి మరొకటి ముడిపెట్టి ఇలా అల్లేస్తున్న వైనం ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తోంది.
ఫౌజీకి బోలెడు వర్క్ ఉన్న మాట నిజమే కానీ డిసెంబర్ 3 అందుకోవడం ఎలాంటి సమస్య లేదని టీమ్ నుంచి వినిపిస్తున్న మాట. మూడు యూనిట్లు నిరంతరాయంగా పని చేస్తున్నాయని, ప్రభాస్ భాగం ఇంకో నెలలోపు అయిపోయేలా అందరూ శ్రమిస్తున్నారని సో ఇంకెలాంటి బ్రేకులు ఉండవని అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ ఎక్కువ టైం డిమాండ్ చేస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా ఒక బృందం ప్రత్యేకంగా ఆ వర్క్ మీద ఉందని వినికిడి.
ఇదంతా చూస్తే ఫౌజీ రాక గురించి ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. ఇక్కడ ఇంకో ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్ ఉంది. ఫౌజీ కనక డిసెంబర్ 3 మిస్ చేసుకుంటే క్రిస్మస్ కి షారుఖ్ ఖాన్ కింగ్ తో తలపడాల్సి ఉంటుంది. డంకీని సలార్ తో ఢీ కొట్టినంత ఈజీగా ఈసారి క్లాష్ ఉండదు. అక్కడ హనుకి బ్రాండ్ లేదు కాబట్టి కేవలం ప్రభాస్, జానర్ మీదే బిజినెస్ చేయాల్సి ఉంటుంది. సంక్రాంతి ఇప్పటికే ప్యాక్ అయిపోయింది. ఈ లెక్కన ఆరు నూరైనా నూరు వెయ్యి అయినా ఫౌజీ రావడం ఫిక్సని చెప్పాలి.
This post was last modified on August 15, 2026 5:51 pm
వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…
రాజకీయ నాయకుల్లో చాలా మందికి సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఆ ఆసక్తి ఉన్న వాళ్లకు కూడా సినిమాలు…
జగన్ పార్టీలో పెద్ద నేతల పలాయనానికి రంగం రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు రెడ్డి నాయకులు పార్టీని వీడారు.…
దేశవ్యాప్తంగా ఒంటరి జీవులు పెరుగుతున్నారా? అంటే.. తాజాగా అసోచామ్ సహా మరో రెండు సంస్థలు చేసిన సర్వే ఔననే సమాధానమే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో…
ఒక సినిమాకు ఒక యాక్టర్‌ను ఎంపిక చేశాక.. మళ్లీ మార్పులు జరగడం సినీ పరిశ్రమలో మామూలే. కాల్ షీట్లు సర్దుబాటు…