Movie News

సంక్రాంతికి సంబరాలు… ఏటిగట్టుకి సవాళ్లు

గత ఏడాది విడుదల కావాల్సిన సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు కొత్త డేట్ ఫిక్స్ చేసుకుంది. 2027 జనవరి 12 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న మెగా 158 పండక్కి వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా మేనల్లుడి ప్రకటన రావడం చూస్తుంటే చిరు నిర్ణయం మారిందేమోనని అభిమానులు అనుమాన పడుతున్నారు.

దానికి క్లారిటీ ఆగస్ట్ 22 వచ్చేస్తుంది కాబట్టి ఇంకో వారం రోజులు వెయిట్ చేయాలి. సరే రిలీజ్ కావడం సంతోషమే కానీ సంబరాల ఏటిగట్టు ముందు కొండలాంటి కాంపిటీషన్ స్వాగతం పలుకుతోంది. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి కాంబో ఆల్రెడీ దానికి అనుగుణంగా షూటింగ్ శరవేగంగా చేస్తోంది. ఇంకా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాకపోయినా రవితేజ – శ్రీవిష్ణు మల్టీస్టారర్ అప్పుడే రావొచ్చని మరో టాక్. శర్వానంద్ – శ్రీను వైట్ల జార్జ్ క్రిష్ నిన్నే జనవరి 12 డేట్ తీసుకుని చెప్పేసింది.

సంబరాల ఏటిగట్టు చాలా పెద్ద బడ్జెట్ తో తీసిన కెజిఎఫ్ తరహా పీరియాడిక్ డ్రామా. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత ఒక ప్రాంతంలో జరిగిన విధ్వంస కాండ ఆధారంగా తెరకెక్కించారు. వినోదం, కామెడీ పెద్దగా ఉండవు. సంక్రాంతికేమో జనాలు ఎక్కువగా ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటారు. కలిసుందాం రా, అల వైకుంఠపురములో నుంచి మొన్న మన శంకరవరప్రసాద్ గారు వరకు ఇది చాలాసార్లు ఋజువయ్యింది. సంబరాల ఏటిగట్టు ఈ సెంటిమెంట్ బ్రేక్ చేయాలి.

గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన మహాకాళి జనవరి రెండో వారంలో వచ్చే ప్లాన్ లో ఉంది. ఆయనతో తీవ్ర విభేదాలు ఉన్న హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డినే ఇప్పుడీ సంబరాల ఏటిగట్టుకి నిర్మాత. అంటే ధృవ స్టయల్ లో ముడిపెట్టి చూస్తే తలపడాలనే ఉద్దేశంతోనే ఇది సెట్ చేసుకున్నారేమో అని అనుమానం రాకమానదు. ఇక్కడితో అయిపోలేదు. బాలయ్య 111, రజనీకాంత్ ధృవన్ కూడా సంక్రాంతి వైపే చూస్తున్నాయి. 

This post was last modified on August 15, 2026 8:29 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

33 minutes ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

2 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

3 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

5 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

6 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

7 hours ago