Political News

న‌ల్ల‌కోటు – తెల్ల చొక్కా… పెద్ద ల‌డాయే!

దేశంలో అతి భారీ విచార‌ణ‌కు సుప్రీంకోర్టు స‌న్న‌ద్ధ‌మ‌వుతోందా? న‌ల్ల కోటుకు-తెల్ల‌చొక్కాకు మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ప్రారంభం కానుందా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే.. దేశంలో పెను సంచ‌ల‌న‌మే కానుంది.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఉన్న ల‌క్షల మంది న్యాయ‌వాదుల విద్య‌పై సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఇటీవ‌ల సందేహాలు వ్య‌క్తం చేసింది. నిజానికి సుప్రీంకోర్టు అనుమానం వ్య‌క్తం చేసింది.. ఢిల్లీ బార్ అసోసియేష‌న్‌లో స‌భ్యులుగా ఉన్న న్యాయ‌వాదుల‌పైనే. కానీ.. ఆ త‌ర్వాత ఈ ప‌రిణామం.. అల‌హాబాద్ నుంచి చెన్నై వ‌ర‌కు కూడా సాగింది.

అంటే.. న్యాయ‌వాదులు పొందుతున్న ప‌ట్టాలపైనే సుప్రీంకోర్టుకు సందేహం ఏర్ప‌డింది. వారు న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌తో న్యాయ వాద వృత్తిలోకి వ‌చ్చార‌న్న అనుమానాలు ఉన్నాయంటూ.. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గ‌త వారం వ్యాఖ్యానించారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న బొద్దింక‌లు, ప‌రాన్న జీవులు.. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తోనే కాక్రోచ్ జ‌న‌తా పార్టీ పుట్టుకువ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం న్యాయవాదుల‌కు చుట్టుకుంది. న్యాయ‌వాద వృత్తిలో ఉన్న‌వారు.. ఇప్పుడు త‌మ‌ను తాము నిరూపించుకోవాల్సి వ‌స్తోంది.

తాజాగా న‌ల్ల‌కోటు ధ‌రించి.. మైలార్డ్ అనే లాయ‌ర్ల‌లో 40 శాతం వ‌ర‌కు న‌కిలీలేన‌ని దేశంలోనే అతి పెద్ద‌, కీల‌క‌మైన‌ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా సుప్రీంకోర్టుకు సంచలన నివేదిక ఇచ్చారు. ఈ 40 శాతం మంది.. న‌లికీ స‌ర్టిఫెక్లు.. లేదా సిఫార‌సుల‌తో డిగ్రీలు పూర్తి చేశార‌ని ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కూడా కోర్టును ఆయ‌న అభ్య‌ర్థించారు. ఇదే జ‌రిగితే.. న‌ల్ల‌కోటు వెనుక ఉన్న వ్య‌వ‌హారాన్ని తెల్ల చొక్కా ధ‌రించే సీబీఐ అధికారులు నిగ్గు తేల్చ‌నున్నారు. ఇది దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి అవుతుంది.

సుప్రీం ఆ ప‌నిచేస్తుందా?

ఎస్‌!. చేస్తుంద‌న్న స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇప్ప‌టికే న్యాయ‌వాదుల ప‌నితీరుపై సుప్రీంకోర్టు అస‌హ‌నంతో ఉంది. పైగా.. వారు వ‌సూలు చేస్తున్న ఫీజుల‌కు.. కేసుల‌కు కూడా సంబంధం ఉండడం లేద‌ని కూడా అభిప్రాయ‌ప‌డింది. కేసుల విష‌యంలో న్యాయం కంటే కూడా.. వారు అమ్ముడు పోతున్నారంటూ.. గ‌త నెల‌లో కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ ప‌రిణామాల‌కు వారు దొడ్డి దారుల్లో వ్యాపార మార్గంగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఎంపిక చేసుకున్నార‌న్న వాద‌న‌తో సుప్రీంకోర్టు ఏకీభ‌వించింది. ఈ నేప‌థ్యంలో సీబీఐకి న్యాయ‌వాదుల డిగ్రీల ప‌రిశీల‌న కేసు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని న్యాయ నిపుణులు చెబుతున్నాయి. ఇది దేశంలోనే సంచ‌ల‌నంగా మారుతుంద‌న్నారు.

This post was last modified on May 25, 2026 2:21 pm

Share

Recent Posts

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

36 minutes ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

39 minutes ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

1 hour ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

3 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

3 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

3 hours ago