Political News

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ‘తీన్మార్’ ఆరోపణ

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే తెర తీసింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసిన సందర్భంగా జగన్ అరెస్టుపై చర్చ జరిగిందని నాగేశ్వర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

నాగేశ్వర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో నాగేశ్వర్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ మద్దతు లబిస్తుండగా… కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు. నాగేశ్వర్ అవినీతి పాల్పడ్డారంటూ మల్లన్న ఆరోపించారు.

పవన్ చెప్పినట్లుగా జగన్ అరెస్టుకు అమిత్ షా ససేమిరా అన్నారని నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు తనకు పార్ట్ టైం మిత్రుడని, జగన్ దీర్ఘకాల మిత్రుడని కూడా అమిత్ షా పేర్కొన్నట్లుగా నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై జనసేన భగ్గుమనగా… నాగేశ్వర్ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు.

వ్యాఖ్యల ఉపసంహరణ తర్వాత ఆయనపై ఏపీలో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో నాగేశ్వర్ కు మద్దతు అమాంతంగా పెరుగుతుండగా… కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు.

సోమవారం నాటి పత్రికల్లో 10టీవీ షేర్ల బదిలీ గురించిన ఓ వార్త రాగా… అందులో మతలబు జరిగిందని సదరు వార్త చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై తాను ఓ రోజు ముందుగానే ఆరోపణలు చేశానని మల్లన్న గుర్తు చేశారు.

తన ఆరోపణలు చూసిన నాగేశ్వర్ తనపై పరువు నష్టం దావా వేస్తానని వేరే వ్యక్తుల వద్ద అన్నారని కూడా మల్లన్న గుర్తు చేసుకున్నారు. దమ్ముంటే నాగేశ్వర్ తనపై పరువు నష్టం దావా వేయాలని, వేస్తే ఏమవుతుంది? ఇంకో కేసు పెరుగుతుందని ఆయన సెటైర్లు సంధించారు.

10 టీవీ షేర్ల బదిలీ విషయాన్ని పక్కనపెడితే… 10 టీవీ పేరు మీద నాగేశ్వర్ పేదోళ్ల పైసలు తిన్నారని మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ దీనిపై విచారణ జరిగితే… ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను తాను అందిస్తానని ఆయన పేర్కొన్నారు.

10 టీవీ పేరు మీద పేదోళ్లు, కార్మికుల పైసలను నాగేశ్వర్ తిన్న వ్యవహారానికి సంబంధించి తాను నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని చెప్పిన మల్లన్న.. దమ్ముంటే నాగేశ్వర్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. వెరసి నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు మరింత రసకందాయంలో పడిందని చెప్పక తప్పదు.

This post was last modified on May 25, 2026 9:00 am

Share

Recent Posts

ఇరుముడి… క్రిష్‌కు ఇంకా బాకీ!

‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…

46 minutes ago

అన్న రాలేదు.. వదినమ్మ ఒక్కరే ఎందుకు?

విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్‌కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…

3 hours ago

మహాకాళి ముందు జాగ్రత్త పడుతోంది

హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…

3 hours ago

రాజకీయాలకు అయ్యన్న గుడ్ బై

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…

4 hours ago

ప్రభాస్ ఓడిన జానర్లో రవితేజ గెలవాలి

ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…

6 hours ago

విజయశాంతికి బెర్త్ ఖరారు?

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖరారైనట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల మంత్రి…

7 hours ago