సూర్య వీరభద్రుడు ఊహించని సెన్సేషన్ చేస్తోంది. నెగటివ్ టాక్, అంతంత మాత్రంగా వచ్చిన రివ్యూలను దాటుకుని మరీ ఏపీ తెలంగాణ రెండో వారం వీకెండ్ లో కూడా మంచి వసూళ్లు నమోదు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ట్రేడ్ టాక్ ప్రకారం పది రోజులకు గాను వీరభద్రుడు సుమారు 20 నుంచి 25 కోట్ల మధ్యలో గ్రాస్ వసూలు చేసింది. ఇది సూర్య ట్రాక్ రికార్డు కోణంలో చూసుకుంటే చాలా పెద్ద నెంబర్. కొన్న వాళ్ళందరూ ఆల్రెడీ లాభాల్లోకి వెళ్లిపోయారు.
నిన్న బుక్ మై షో ట్రెండింగ్ ఇరవై నాలుగు గంటల వ్యవధికి 31 వేలకు పైగా టికెట్లు అమ్మిన మూవీ ఇదొక్కటే. ఆ తర్వాత దృశ్యం 3 ఉంది. ట్రాజెడీ ఏంటంటే టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమా ఏదీ కనీస స్థాయిలో బుకింగ్స్ నమోదు చేయలేకపోయాయి. ప్రమోషన్స్ పరంగా పురుష, అగ్లీ స్టోరీ కాస్తంత సౌండ్ చేశాయి కానీ అవి కలెక్షన్లకు దోహదపడలేదు. పైగా టాక్స్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయిన దాఖలాలు లేకపోలేదు.
ఇక వీరభద్రుడు విషయానికి వస్తే తమిళ వెర్షన్ కరుప్పు రెండు వందల యాభై కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతోంది. చాలా డ్రై సీజన్ లో వేసవి వృథాగా పోతోందని బయ్యర్లు భావిస్తున్న టైంలో ఈ సినిమా కల్పతరువుగా మారిపోయింది. ముఖ్యంగా కరుప్పు స్వామి మీద పెట్టిన ఎలిమెంట్స్, కాంతార తరహా క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. తమిళనాడులోని పలు థియేటర్లలో చాలా మందికి పూనకాలు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెద్ది రాకకు ఇంకా ఎనిమిది రోజుల టైం ఉంది. అప్పటిదాకా వీరభద్రుడుకి ఛాన్స్ ఉంది. వీక్ డేస్ లో యథావిధిగా నెమ్మదిస్తుంది కానీ మళ్ళీ ఇంకో వారాంతం కలిసి వస్తుంది కాబట్టి అంకెలు మరింత పెరుగుతాయి. దీని ఎఫెక్ట్ వల్ల సూర్య తర్వాతి సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ కు డిమాండ్ పెరిగిందట. ముందు అనుకున్న రేట్ల కన్నా ఇప్పుడు ఎక్కువ చెబుతున్నారని డిస్ట్రిబ్యూటర్ వర్గాల కథనం. అంతే మరి సూపర్ హిట్ తర్వాత వచ్చే ఏ హీరో సినిమాకైనా ఇలా జరగడం సహజం.
This post was last modified on May 25, 2026 1:07 pm
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…