కోలీవుడ్ స్టార్ సూర్య సుడి బాగుంది. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ గజిని హీరోకి వరసగా హిట్లు పడటం అభిమానులను ఆనందంతో ముంచెత్తుతోంది. నిన్న విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు తమిళనాడు కన్నా తెలుగు రాష్ట్రాల ఆక్యుపెన్సీలే బాగుండటం ఆశ్చర్యం కలిగించినా, క్వాలిటీ కంటెంట్ పట్ల మనోళ్ల ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందనేది డిసి వచ్చిన కొద్దిరోజులకే విశ్వనాథ్ అండ్ సన్స్ ఋజువు చేస్తోంది.
తొలి రోజు కొంచెం అటు ఇటుగా ముప్పై కోట్లకు దగ్గరగా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ టాక్. టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఉదయం నెమ్మదిగా మొదలైన వసూళ్ల పర్వం రాత్రి సెకండ్ షో సమయానికి పీక్స్ కు చేరుకుంది. హైదరాబాద్ లాంటి నగరాలు, జిల్లా కేంద్రాల్లో బుకింగ్స్ అనూహ్యంగా పెరిగాయి. బుక్ మై షోలో నిన్న గంటకు ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చిన్న విషయం కాదు. ఆవారాపన్ 2తో కాంపిటీషన్ మంచి రసపట్టులో జరుగుతోంది.
ఇంకా వీకెండ్ అయిపోలేదు కాబట్టి విశ్వనాథ్ అండ్ సన్స్ ఎంత స్థాయికి వెళ్తుందనేది ఇప్పుడే చెప్పలేం కానీ బాక్సాఫీస్ దగ్గర వాతావరణం చాలా సానుకూలంగా ఉంది. వారాంతంలో ఇండిపెండెన్స్ డే సెలవు కలిసి రావడం పెద్ద ప్లస్ కానుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు వేరే ఛాయస్ పెట్టుకోవడం లేదు. డిసి ఏ సర్టిఫికెట్ మూవీ కావడం, కొరియన్ కనకరాజు ఆల్రెడీ నెమ్మదించడం లాంటి అంశాల వల్ల సూర్య ఈ వీకెండ్ ని పూర్తిగా డామినేట్ చేయనుండటం స్పష్టంగా కనిపిస్తోంది.
ఎలాంటి అసభ్యత లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగులు వాడకుండా ఇరవై సంవత్సరాల గ్యాప్ ఉన్న ఒక జంట మధ్య ఇలాంటి ఎంటర్ టైనర్ ని దర్శకడు వెంకీ అట్లూరి నడిపించిన తీరుకి ప్రశంసలు దక్కుతున్నాయి. సెకండాఫ్ హ్యాండిల్ చేయడం గురించి కొన్ని కామెంట్స్ ఉన్నప్పటికీ అవేవి బాలేవని చెప్పేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఎమోషన్స్ వర్కౌట్ కావడం పబ్లిక్ టాక్ పరంగా అనుకూలంగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే త్వరగానే వంద కోట్లు దాటేయొచ్చు.
This post was last modified on August 15, 2026 10:12 am
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…