ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమని అన్నా కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన భర్త పనితీరును మెచ్చుకోవడంతోపాటు.. ఆయన భార్యగా తాను ఎంతో గర్విస్తున్నట్టు కూడా పేర్కొంటున్నారు. అలానే తిరుపతి నుంచి తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం.. తలనీలాలు సమర్పించడం కూడా తెలిసిందే. ఇవన్నీ అన్నా కొణిదెల వ్యక్తిత్వాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీనికి నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా అన్నా కొణిదెల తన సింప్లిసిటీని చాటుకున్నారు. సాధారణ మహిళగా రైలులో ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను జనసేన పార్టీ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారన్న విషయం తెలియదు కానీ.. రైలులో ప్రయాణిస్తున్నట్టు మాత్రం స్పష్టం అవుతోంది. సాధారణ ప్రయాణికులతో కలిసి రైలులో ప్రయాణం చేశారు. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ఆమె కూర్చున్న ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. అన్నా సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.
వాస్తవానికి సర్పంచుల కుటుంబాలే.. విమానాల్లో తిరుగుతున్న నేటి కాలంలో ప్రముఖ నటుడు, ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్న నాయకుడి సతీమణి తాను అనుకుంటే.. ప్రైవేట్ జెట్‌లు, ప్రత్యేక వాహనాల్లో కూడా తిరగొచ్చు. కానీ, దీనికి భిన్నంగా సామాన్య ప్రయాణికురాలిగా అన్నా కొణిదెల రైలు ప్రయాణం చేయడం ఆమె సింప్లిసిటీకి నిదర్శనమని సోషల్ మీడియా నెటిజన్లు పేర్కొన్నారు. బోగీలోని ప్రజలతో మమేకమవుతూ సామాన్య జీవనశైలిని కొనసాగించడం పట్ల నెటిజన్ల ప్రశంసలు గుప్పిస్తున్నారు.
This post was last modified on August 14, 2026 9:40 pm
వైసీపీ అధినేత జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదు. ఎన్నికల్లో…
మెగాస్టార్ చిరంజీవి ఏ ఈవెంట్‌కు హాజరైనా తనదైన శైలిలో పంచులు వేస్తూ.. హుషారుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. తెర మీదే…
పెళ్లంటే నూరేళ్ళ పంట అనేది పాత సినిమాలో హిట్టయిన పాట. హరియాణాకు చెందిన గ్యాంగ్ స్టర్ మైనపాల్ ఢిల్లా మాత్రం…
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే రీల్స్ ప్రాణాల మీదకు తెస్తున్న విషయం తెలిసిందే. రైలు పట్టాలపై పడుకుని, కూర్చుని…
టాలెంట్ లోటు లేకపోయినా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ప్రియదర్శి కెరీర్ రెండు హిట్లు నాలుగు ఫ్లాఫుల్లా సాగిపోతోంది.…
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సీరియస్‌గా ఉన్న…