Movie News

బొమ్మరిల్లు హాసిని… విశ్వనాథ్ మ్యాడీ

వరల్డ్ బిల్డింగులు, ఎలివేషన్లు, గ్యాంగ్ స్టర్ డ్రామాలు నిండిపోయిన ట్రెండ్ లో హీరోల డామినేషన్ తోనే కథలు రాస్తున్న దర్శకులు ఎక్కువగా ఉన్నారు. కెజిఎఫ్ లో శ్రీనిధి శెట్టికి దక్కిన ప్రాధాన్యత అంతంత మాత్రమే. సలార్ లో శృతి హాసన్ ఎంతసేపు ఉందో నిమిషాల మీద లెక్కబెట్టొచ్చు. ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ ని కొన్ని సీన్లకే పరిమితం చేశారు. పెద్దిలో జాన్వీ కపూర్ గురించి చెప్పనక్కర్లేదు. పుష్పలో మాత్రమే రష్మిక మందన్నకు కాసిన్ని చెప్పుకోదగ్గ ఎపిసోడ్లు పడి తనకు ప్లస్ అయ్యాయి.

ఇలాంటి పోకడ ఉన్న టైంలో ఒక హీరోయిన్ కి పెర్ఫార్మన్స్ చూపించుకునే అవకాశంతో పాటు హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కడం అదృష్టమనే చెప్పాలి. మమిత బైజు ఆ ఛాన్స్ కొట్టేసింది. విశ్వనాథ్ అండ్ సన్స్ లో సూర్య, రాధికా శరత్ కుమార్ లను ఆటపట్టిస్తూ చిన్న పిల్లాడితో బంధం ఏర్పరుచుకునే క్యారెక్టర్ లో మమిత బెస్ట్ ఇచ్చేసింది. తన ఇంట్రో అయిపోయాక మమిత లేని సన్నివేశాలు ఎన్ని ఉన్నాయంటే సమాధానం చెప్పడం కష్టం. అంతగా అల్లుకుపోయింది.

ఇక్కడ బొమ్మరిల్లు ప్రస్తావన తేవడానికి కారణం ఉంది. ఇరవై సంవత్సరాల క్రితం భాస్కర్ అనే దర్శకుడు హాసిని పాత్రను సృష్టించాడు. తిట్టాలి కొట్టాలి అనిపించినా కల్మషం లేని అమాయకత్వం, భోళాతనం ఉన్న క్యారెక్టర్ లో జెనీలియా నటన ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది. హీరో సిద్దార్థ్ కన్నా యూత్ హాసినినే గుర్తు పెట్టుకుని ‘అంతేనా ఇంకేం లేవా’ పదాలను పాపులర్ చేశారు. అంత గొప్పగా కాదు కానీ స్క్రీన్ టైం కోణంలో చూస్తే విశ్వనాథ్ మ్యాడీ కూడా స్పెషల్ గానే నిలుస్తుంది.

విజయ్ జన నాయకుడులో కీలక పాత్ర పోషించిన మమిత బైజుకు దాని నెగటివ్ ఫలితం వల్ల ప్రయోజనం కలగలేదు. ఏదో విజయ్ ఇమేజ్ వల్ల తమిళనాడులో ఓ మోస్తరుగా ఆడింది కానీ బయట మాత్రం తిరస్కారానికి గురయ్యింది. అయితే విశ్వనాథ్ అండ్ సన్స్ తనకు పెద్ద రిలీఫ్ అయ్యేలాగే ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తమిళనాడు కంటే మెరుగ్గా మన రాష్ట్రాల్లో రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషం. దెబ్బకు తెలుగు ఆఫర్లు పెరిగేలా ఉన్నాయి.

This post was last modified on August 15, 2026 10:10 am

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago