Political News

జగన్ మంచోడు కాబట్టే వాళ్లు బ్రతికున్నారు

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కొంతకాలంగా కూటమి పార్టీల నేతలు ట్రోలింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు కామెంట్ చేస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో అయితే వైసీపీ నేతలను యాక్స్ గ్యాంగ్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆ కామెంట్లపై స్పందించారు. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అంటూ జగన్ ప్రశ్నించారు.

‘‘జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపినోళ్లు ఇంకా ప్రశాంతంగా తిరుగుతున్నారు…జగన్ నైజం ఎలాంటిది అనేదానికి అదే నిదర్శనం…వారంతా ఇంకా బతికే ఉన్నారు…వారికి ఎప్పటికీ ఏమీ కాదు…నేను చెడ్డోడిని అయితే మా తాతను దారునంగా నరికి చంపిన వాళ్లు ఇప్పుడు ప్రశాంతంగా తిరిగేవారా అని ప్రశ్నించారు.

చంద్రబాబులా హత్యా రాజకీయాలు చేయడం నాకు తెలియదు….ప్రజలకు మంచి చేసి మంచిపేరు సంపాదించాలని నాన్న రాజశేఖర్ రెడ్డి నేర్పించారు..’’అంటూ జగన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.

తన కుటుంబం తన తాత, తండ్రి, చిన్నాన్న..ముగ్గురిని కోల్పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డళ్లు, గునపాలు ఎవరికి అవసరమో ప్రజలందరికీ తెలుసని అన్నారు. విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. రెండేళ్లలో ఎంతోమంది వైసీపీ నేతలు, కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on May 21, 2026 9:04 pm

Share

Recent Posts

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

8 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

2 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

2 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

3 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

6 hours ago