Movie News

చరణ్‌కు రాజమౌళి ఇచ్చిన మోటివేషన్ టిప్

మెగా పవర్ స్టార్ కెరీర్లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సినిమా.. ఆర్ఆర్ఆర్. అందులో సీతారామరాజు పాత్రలో చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రామ్ పాత్రకు, అందులో చరణ్ నటనకు అబ్బురపడ్డాడు. బాలీవుడ్లో నటించిన ‘జంజీర్’ సినిమాతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చరణ్.. ఈ చిత్రంతో అక్కడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

అలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చిన సినిమా విషయంలో చరణ్ ఒక దశలో పూర్తిగా మోటివేషన్ కోల్పోయాడట. అందుకు కారణం కొవిడ్ అని.. ఆ వైరస్ కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో తాను ప్రేరణ కోల్పోయి, మళ్లీ పని చేయడానికి సిద్ధంగా లేని స్థితికి చేరుకున్నానని చరణ్ గుర్తు చేసుకున్నాడు. ఆ టైంలో దర్శకుడు రాజమౌళి ఇచ్చిన సలహా తనలో మార్పు తెచ్చినట్లు అతను వెల్లడించాడు.

కొవిడ్ వల్ల లాక్ డౌన్ విధించడంతో ఏమీ పాలుపోని స్థితికి తాను చేరుకున్నానని.. ఇంకో 20 రోజుల్లో ఫస్ట్ లాక్ డౌన్ తీసేయబోతున్నారని తెలిసినా, మళ్లీ షూటింగ్‌కు వెళ్లాలన్న ఉత్సాహం తనలో కలగలేదని చరణ్ తెలిపాడు. ఇదే విషయాన్ని రాజమౌళికి తాను చెబితే.. ఆయన చాలా మంచి సలహా ఇచ్చాడని చరణ్ గుర్తు చేసుకున్నాడు.

మోటివేషన్ కోసం పెద్ద పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదని.. రోజుకు ఒక టాస్క్ లాంటిది పెట్టుకోమని, అది తన బెడ్‌రూంను శుభ్రం చేసుకోవడం కావచ్చు లేదంటే బాల్కనీని బాగు చేసుకోవడం కావచ్చు.. లేదా ఫామ్ హౌస్‌ను ది బెస్ట్‌గా తీర్చిదిద్దుకోవడం కావచ్చు.. ఇలా ఏదో ఒక టాస్క్ పెట్టుకుని దాని కోసం పని చేయమని, ప్రేరణ దానంతట అదే వస్తుందని రాజమౌళి సూచించినట్లు చరణ్ తెలిపాడు.

తాను రాజమౌళి సలహాను పాటించగా, అది అద్భుతంగా పని చేసిందని.. తర్వాత మూణ్నాలుగేళ్లలో తనకు ఏ రోజూ మోటివేషన్ లేని పరిస్థితి ఎదురు కాలేదని చరణ్ తెలిపాడు. ‘పెద్ది’ సినిమాలో హీరో పాత్ర కూడా అంతేనని.. అతడికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగడని, ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడని.. ఉన్న వనరులను వాడుకుంటూ ముందుకు వెళ్లిపోతాడని.. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి చేసిన కారు ఇంటర్వ్యూలో చరణ్ వెల్లడించాడు.

This post was last modified on May 21, 2026 6:56 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

27 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

33 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

48 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago