ఏపీ రాజధాని విషయంలో అనూహ్య స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. వాస్తవానికి ఏ నగరం అయినా.. నిర్మాణం పూర్తి చేసుకున్నప్పుడు.. దానికి సంబంధించిన ప్రచారం లభిస్తుందని తెలిపారు. కానీ, అమరావతి విషయంలో మాత్రం నిర్మాణ దశలో ఉండగానే.. రాజధానిపై దేశవ్యాప్తంగా ఆశలు రేకెత్తుతున్నాయన్నారు. నమ్మకం-లక్ష్యం-భవిష్యత్తుకు రాజధాని అమరావతి నిలువెత్తు నిదర్శ నంగా ఉందన్నారు.
అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ కోసం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంజనీర్లు పనిచేస్తున్నారని.. వారంతా ఎంతో అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ముంబై నుంచి వచ్చిన గోపాల్, లక్ష్మయ్యలు.. క్వాంటం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. వారిని అభినందిస్తున్నానన్నారు. సీఎం చంద్రబాబు విజన్‌ను నమ్మి.. భవిష్యత్తు తరాల కోసమే వీరంతా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని అమరావతిని భవిష్యత్తు మార్గనిర్దేశక నగరంగా అభివర్ణించారు.
పనులు వడివడి..
అమరావతి రాజధాని పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా.. న్యాయ మూర్తుల భవనాలను పూర్తి చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేటాయించే భవనాలను కూడా పూర్తి చేస్తున్నారు. వీటిని త్వరలోనే ప్రభుత్వ పాలనా విభాగానికి హాండోవర్ చేయనున్నారు.
తద్వారా ఇక్కడ నివాసాలు పెరిగి.. కార్యకలాపాలు పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కాంటం కంప్యూటింగ్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. వచ్చే మూడు మాసాల్లోనే వీటిని పూర్తి చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates