Political News

పిఠాపురంలో ఈ సారి వార్ వ‌న్‌సైడే…!

జ‌నసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మార్మోగుతోంది. ఎక్కడ చూసినా ఏ నలుగురు కలిసినా ఎమ్మెల్యే తీరును ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్నారని, అన్ని సామాజిక వర్గాలను పట్టించుకుంటున్నారని పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. నిజానికి ఈ తరహా చర్చ రాష్ట్రంలో జరగడం ఇదే తొలిసారి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు -ఎమ్మెల్యేలకు మధ్య సంబంధం బాగా ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం కొంత వ్యతిరేకత కనిపించిన పరిస్థితి ఉంది.

కానీ ఇప్పుడు దానికి భిన్నంగా పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ జపం మార్మోగుతోంది. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో పాజిటివ్ గా స్పందిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఒక సామాజిక వర్గం బలంగా పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడింది. 70 వేల‌ ఓట్ల మెజారిటీ దక్కించుకుని విజయం సాధించారు. అయితే ఆ సామాజిక వర్గానికి మాత్రమే పవన్ కళ్యాణ్ పరిమితం కాకుండా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఆయన పట్టించుకుంటున్నారు.

ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మరింత వేగంగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు లేకపోగా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పిఠాపురంలో ఎటుచూసినా సిమెంట్ రోడ్లు.. రహదారుల సుందరీకరణ.. గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేవిధంగా ఉప్పాడ వంటి ప్రాంతాల్లో మత్స్యకారులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అదే విధంగా కొబ్బరి రైతులకు సంబంధించి గత కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. సముద్ర తీరంలో రక్షణ గోడ నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వ్యక్తిగతంగా కూడా సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపుతున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరిని కదిలించినా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుండడం విశేషం. దీనికి తోడు వైసిపి నుంచి వచ్చిన దొరబాబు పార్టీ కార్యక్రమాలను నిశితంగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు అండగా కూడా ఉంటున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు పిఠాపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి ఏకపక్ష విజయాన్ని దక్కించే అవకాశం ఉందన్న చర్చకు దారితీస్తున్నాయి.

This post was last modified on May 15, 2026 4:02 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago