Movie News

దురంధ‌ర్-2… హాట్ స్టార్ నిర్ణ‌యంతో న‌ష్ట‌మే

ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే ఆల్ టైం హైయెస్ట్ గ్రాస‌ర్ల‌లో ఒకటిగా నిలిచిన చిత్రం.. దురంధ‌ర్-2. గ‌త ఏడాది చివ‌ర్లో వ‌చ్చిన దురంధ‌ర్ సినిమా థియేట‌ర్ల‌లో అద్భుత విజ‌యం సాధించాక ఓటీటీలోనూ దుమ్ము దులిపింది. నెట్ ఫ్లిక్స్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ్యూయ‌ర్‌షిప్ సాధించిన ఇండియ‌న్ మూవీస్‌లో ఒక‌టిగా అది నిలిచింది. దానికి కొన‌సాగింపుగా వ‌చ్చిన దురంధ‌ర్-2 అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్నందుకుంది.

ఈ సినిమాను థియేట‌ర్ల‌లో చూడ‌ని వాళ్ల‌తో పాటు.. చూసిన వాళ్లు కూడా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌లో పెద్ద సినిమాల‌న్నీ థియేట‌ర్ల‌లో రిలీజైన 8 వారాల త‌ర్వాతే ఓటీటీలోకి వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ గ‌డువు పూర్తి కావ‌డంతో ఈ సినిమాను డిజిట‌ల్‌గా చూసేందుకు ఆడియ‌న్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ హాట్ స్టార్ దురంధ‌ర్‌-2ను ఇప్పుడే రిలీజ్ చేయ‌ట్లేదు. జూన్ 4 నుంచి స్ట్రీమ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ప్ర‌స్తుతం ఐపీఎల్ పీక్‌లో న‌డుస్తున్న నేప‌థ్యంలో ఆ టోర్నీ ముగిశాకే దురంధ‌ర్-2ను స్ట్రీమ్ చేయాల‌ని ఆ డేట్ ఫిక్స్ చేసిన‌ట్లున్నారు. కానీ ఇది స‌రైన నిర్ణ‌యంలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే దురంధ‌ర్-2 నెట్ ఫ్లిక్స్ ద్వారా విదేశాల్లో ఇప్ప‌టికే స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. వివిధ భాషల్లో సినిమాను స్ట్రీమ్ చేస్తున్నారు. దురంధ‌ర్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్‌కే ఇచ్చిన నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్.. దురంధ‌ర్-2 విష‌యంలో భిన్నంగా ఆలోచించింది.

విదేశాల వ‌ర‌కు నెట్‌ఫ్లిక్స్‌కు హ‌క్కులు ఇచ్చి.. ఇండియా వ‌ర‌కు త‌మ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం జియో హాట్ స్టార్‌లో సినిమాను రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించింది. కానీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా విదేశాల్లో రిలీజైన ఈ సినిమాను పైర‌సీ చేసి ఆల్రెడీ వెబ్ సైట్లలో పెట్టేశారు. అన్ని ప్ర‌ధాన భాష‌ల్లోనూ హెచ్డీ ప్రింట్ ఆన్ లైన్లోకి వ‌చ్చేసింది. మూవీ రూల్స్, టెలిగ్రాం ద్వారా పెద్ద ఎత్తున డౌన్ లోడ్స్ జ‌రుగుతున్నాయి. హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వ‌చ్చేలోపు పుణ్య‌కాలం గ‌డిచిపోతుండ‌డంతో ఈలోపు జ‌నం ఆపుకోలేక పైరసీ వెర్ష‌న్ల‌ను ఆశ్ర‌యించే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అందులోనూ హాట్ స్టార్‌లో యాడ్స్ బాధ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీగా హెచ్డీ ప్రింట్ అందుబాటులో ఉండ‌డంతో పైర‌సీ ప‌ట్ల ఎక్కువ‌మంది ఆక‌ర్షితుల‌వ‌డం ఖాయం. కాబ‌ట్టి లేట్ స్ట్రీమింగ్ హాట్ స్టార్‌కు చాలా న‌ష్టం చేకూర్చేలా ఉంది.

This post was last modified on May 15, 2026 9:05 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago