Movie News

పెద్దికి ఫ్రీ పబ్లిసిటీ

తెలుగులో ఇటు ఇండస్ట్రీ.. అటు ప్రేక్షకులు.. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా.. పెద్ది. సంక్రాంతి తర్వాత వెలవెలబోతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరిలూదే సినిమా అవుతుందని ‘పెద్ది’ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. తెలుగులో అనే కాక ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

ఐతే అనుకూల పరిస్థితుల మధ్య వస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్ మాత్రం సరిగా లేదని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా పాటలు, ప్రోమోల వల్ల పాన్ ఇండియా స్థాయిలో మంచి బజ్ వచ్చింది కానీ.. రిలీజ్ టైంకి హైప్ ఇంకా పెంచేలా టీం రిలీజ్ ముంగిట సరైన ప్రమోషన్లు చేయలేదని అభిమానులు ఫీలవుతూ వచ్చారు కొన్ని రోజుల ముందు వరకు. ఐతే విడుదలకు ముందు రెండు వారాలు ‘పవర్ ప్లే టూర్’ పేరుతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది టీం.

కానీ అంతకంటే ముందు తెలుగు రాష్ట్రాల వరకు టీం రంగంలోకి దిగడానికి ముందే కావాల్సినంత పబ్లిసిటీ జరిగిపోయింది ‘పెద్ది’ సినిమాకు. గత కొన్ని రోజులుగా తెలుగు సినీ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఎంత గొడవ జరుగుతోందో తెలిసిందే. సింగిల్ స్క్రీన్లకు ఇప్పుడున్న అద్దె విధానం స్థానంలో మల్టీప్లెక్సుల తరహాలోనే పర్సంటేజీ పద్ధతిని తేవాలని ఎగ్జిబిటర్లు అల్టిమేటం విధిస్తే.. అలా కుదరదని నిర్మాతలు తేల్చారు.

ఈ నేపథ్యంలో పరస్పరం ప్రెస్ మీట్లు పెట్టి అనేక ఆరోపణలు చేశారు. ఈ గొడవకు మీడియా నుంచి బోలెండంత కవరేజీ దక్కింది. సోషల్ మీడియాలో కూడా గత కొన్ని రోజులుగా దీని మీదే చర్చ నడుస్తోంది.

ఐతే ఈ గొడవలో ‘పెద్ది’ సినిమా సెంటర్ పాయింట్‌గా ఉండడం గమనార్హం. ‘పెద్ది’ సినిమాను టార్గెట్ చేసే క్రమంలోనే పర్సంటేజీ విధానాన్ని తెరపైకి తెచ్చారని నిర్మాతలు అనడం.. అదేమీ లేదని అవతలి వర్గం వాదించడం.. మీడియాలో, సోషల్ మీడియాలోనూ దీని మీద విశ్లేషణలు రావడం.. ఈ సినిమా ప్రస్తావనతోనే నెటిజన్లు కూడా పోస్టులు పెట్టడం.. ఇలా ‘పెద్ది’ సినిమా గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ సినిమాకు పైసా ఖర్చు పెట్టకుండా, చరణ్ అండ్ టీం రంగంలోకి దిగకుండానే బోలెడంత పబ్లిసిటీ వచ్చేసింది.

This post was last modified on May 15, 2026 4:39 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago