కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు సులభతరంగా మారింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు చేపట్టిన సరికొత్త చర్యల వల్ల వేలాది మంది భక్తులకు ఇప్పుడు కేవలం గంటల వ్యవధిలోనే స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతోంది. వెరసి గతంలో గంటల తరబడి క్యూ లైన్లలో నిలవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు.
అదే సమయంలో దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు విడిది సౌకర్యం లభ్యత కూడా బాగా పెరిగింది. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వ్యవస్థ దోహదం చేస్తోందని చెప్పాలి.
ఈ నెల 2న తిరుమల వెంకన్నను 91 వేల మంది దాకా దర్శనం చేసుకున్నారు. వీరందరికీ కేవలం 12 గంటల్లోనే స్వామి వారి దర్శనం కల్పించిన టీటీడీ సత్తా చాటింది. తాజాగా బుధవారం 80 వేల మంది స్వామి వారిని దర్శించుకోగా… వారికి కేవలం 8 గంటల్లోనే స్వామి వారి దర్శనం కల్పించిన టీటీడీ సరికొత్త రికార్డు నమోదు చేసింది.
అంటే…. గంటకు 10 వేల మంది చొప్పున స్వామి వారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. గతంలో ఇదే 80 వేల మంది స్వామి వారిని దర్శించుకోవాలంటే 18 నుంచి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఐసీసీసీ వల్ల కేవలం ఓ గంటలోనే 10 వేల మందికి స్వామి వారి దర్శనం లభిస్తోంది.
కేవలం అతి స్వల్ప వ్యవధిలోనే స్వామి వారి దర్శనం లభిస్తున్న నేపథ్యంలో తిరుమలలో విడిది గదులను బుక్ చేసుకుంటున్న భక్తులు.. దర్శనం వెంటనే వాటిని ఖాళీ చేస్తున్నారు. ఫలితంగా తిరుమల కొండపై విడిది గదుల కొరత అన్న సమస్యల ఉత్పన్నం కావడం లేదు.
స్వామి వారి దర్శనం కోసం వస్తున్న దాదాపు అందరు భక్తులకూ విడిది గదులు లభిస్తున్నాయని చెప్పాలి. గతంలో అయితే గదుల కోసం భక్తులు సుదీర్ఘ కాలం పాటు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు త్వరితగతిన దర్శనాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో గదుల లభ్యత కూడా బాగా పెరిగింది.
This post was last modified on May 14, 2026 11:02 am
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…