Political News

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు కూడా.. అదేవిధంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనికి కార‌ణం.. రాజ్యస‌భ‌లో బ‌లం ఎక్కువ‌గా ఉండ‌డ‌మే. అయితే.. ఇప్పుడు ఆ బ‌లం స‌గానికిపైగా త‌గ్గిపోనుంది. దీంతో కేంద్రంలో వైసీపీ వాయిస్ పెద్ద‌గా వినిపించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం వైసీపీకి రాజ్య‌స‌భ‌లో వైవీ సుబ్బారెడ్డి, మేడా ర‌ఘునాథ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ఎస్‌.నిరంజ‌న్ రెడ్డి, ప‌రిమ‌ళ్ న‌త్వానీ.. ఇలా ఏడుగురి బ‌లం ఉంది. అయితే.. వీరిలో ప‌రిమ‌ళ్ న‌త్వానీ.. పేరుకే వైసీపీ త‌ర‌ఫున ఎన్నికైనా.. ఆయ‌న రాజ‌కీయం అంతా కూడా బీజేపీతోనే ముడి ప‌డి ఉంది. పైగా.. అప్పుడు సీటు కోసం అంబానీతో క‌లిసి జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు వ‌చ్చారు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిమ‌ళ్ న‌త్వానీ ఏపీ వైపు చూసిందేలేదు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం ఏడుగురి బ‌లం ఉంది. దీంతోనే కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు వైసీపీ విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వైసీపీ కూడా సానుకూలంగానే స‌హ‌క‌రిస్తోంది. కానీ, ఇప్పుడు ఈ ఏడుగిరిలో ముగ్గురి ప‌ద‌వీ కాలం మ‌రో 40 రోజుల్లోనే ముగిసిపోతుంది. వ‌చ్చే నెల 21తో ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యుల ప‌దవీ కాలం ముగియ‌నుండ‌డంతో వైసీపీకి కేంద్రంలో ప్రాధాన్యం త‌గ్గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

వీరిలో పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ప‌రిమ‌ళ్ న‌త్వానీ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. వీరంతా వ‌చ్చే నెల 21న రిటైర్ కానున్నారు. పైగా.. ప్ర‌స్తుతం అసెంబ్లీలో వైసీపీ బ‌లం కూడా లేక‌పోవ‌డంతో ఈ సీట్ల‌న్నీ.. అధికార కూట‌మి పార్టీల‌కే చెందుతాయి. ఫ‌లితంగా రాజ్య‌స‌భ‌లో వైసీపీ బ‌లం నరుగురు స‌భ్యుల‌కు ప‌డిపోతుంది. దీంతో స‌హ‌జంగానే రాజ‌కీయంగా ప్రాధాన్యం తగ్గుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే 2029 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తే త‌ప్ప‌.. మ‌ళ్లీ పెద్ద‌ల స‌భ‌పై ఆశ‌లు ఉండ‌వ‌ని చెబుతున్నారు.

This post was last modified on May 13, 2026 9:52 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago