Political News

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు ఉదాహరణగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనం నిలుస్తోంది. అప్పుడప్పుడో అల్లూరి జిల్లాలో పర్యటించిన సందర్భంగా పాడుబడిన ఆ పాఠశాలను సందర్శించిన పవన్.. అక్కడి పిల్లలు, ఉపాధ్యాయుల కోరిక మేరకు నూతన భవనం నిర్మించి ఇస్తామని మాట ఇచ్చారు. చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించి ఇచ్చారు.

గతంలో గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన పవన్ కల్యాణ్… అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పరిధిలోని పెదపాడు గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కింద నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వ పాఠశాల భవనంలోకి వెళ్లి… ఉపాధ్యాయులు, విద్యార్థులతో మమేకం అయ్యారు. తమ పాఠశాలకు పవన్ రావడంతో ఉబ్బితబ్బిబ్బైన పిల్లలు, టీచర్లు…తమ పాఠశాల భవనం పాతది అయిపోయిందని, శిథిలావస్థకు చేరుకుందని కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు.

ఈ సందర్భంగా పిల్లలతో పాటు పవన్ కూడా పాడుబడ్డ భవనం మాదిరిగా ఉన్న తరగతి గదిలోకి వెళ్లారు. అక్కడి పరిస్థితులను గమనించారు. కొత్త భవనం కట్టించాలన్న పిల్లల అభ్యర్థనలో వాస్తవముందని గ్రహించారు. అంతే… ఏమాత్రం ఆలోచించకుండా ఈ పాఠశాలకు కొత్త భవనాన్ని నిర్మించి ఇస్తామని మాట ఇచ్చారు.

అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన పవన్ ఆ విషయాన్ని మరిచిపోలేదు. సంబంధిత శాఖ అదికారులతో చర్చించారు. కొత్త భవనాన్ని మంజూరు చేశారు. కొత్త భవనం కోసం రూ.17.50 లక్షలను మంజూరు చేయించారు. ఆ నిధులతో పాఠశాల భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ పాఠశాలలో చదవుకుంటున్న పిల్లలు కొత్త భవనాన్ని చూసి కేరింతలు కొడుతున్నారు. దీనిని చూసిన వారంతా పవన్ ఏదైనా చెప్పారంటే చేసేస్తారంతే అని గుర్తు చేసుకుంటున్నారు.

This post was last modified on May 13, 2026 8:05 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

8 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

10 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

10 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

12 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

13 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

14 hours ago