Political News

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు. వ‌దిలి పెట్ట‌దు అని రాసిన పోస్ట‌ర్లు.. దాదాపు తిరువ‌నంత‌పురంలోని అన్ని కూడ‌ళ్ల‌లోనూ క‌నిపించాయి. ముఖ్యంగా వ‌య‌నాడ్ ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు కూడా మీరు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మీకు సంచులు మోసే కేసీ వేణుగోపాల్ కూడా మిమ్మ‌ల్ని కాపాడ‌రు.. అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌యి.. రిజల్ట్ కూడా వచ్చేసి దాదాపు 10 రోజులు అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కాలేదు. 140స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూడీఎఫ్ కూట‌మి 102 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వ ఏర్పాటు ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్గానే ఉంది. దీనికి కార‌ణం ముఖ్య‌మంత్రి పీఠానికి సంబంధించి ఇంకా ఒక నిర్ణ‌యం తీసుకోక‌పో వ‌డ‌మే. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో అస‌హ‌నం పెల్లుబుకుతోంది.

ప్ర‌ధానంగా ప్ర‌జ‌లు కోరుకుంటున్న స‌తీశ‌న్‌ను కాద‌ని.. రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్‌కు ముఖ్య‌మంత్రి పీఠాన్ని అప్ప‌గించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై పార్టీలు వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. అంతేకాదు.. యూడీఎఫ్‌లో 22 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉన్న ఐయూఎంఎల్ పార్టీ కూడా స‌తీశ‌న్‌కే మ‌ద్ద‌తుగా ఉంది. ఈ నేప‌థ్యంలో కేసీ వేణుగోపాల్‌ను ఎంపిక చేస్తున్నార‌న్న వ్య‌వ‌హారంపై అన్ని ప‌క్షాల్లోనూ వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

మ‌రోవైపు కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంపై ఇంకా ఎటూ తేల్చ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డం.. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును అప‌హాస్యం చేయ‌డ‌మేన‌న్న వాద‌న కూడా ప్ర‌బ‌లుతోంది. ఈ క్ర‌మంలో రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ.. కొంద‌రు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించ‌డం.. పార్టీ కార్యాల‌యాల ముందే నిర‌స‌న పోస్ట‌ర్లు అంటించ‌డం.. సంచ‌ల‌నంగా మారింది.

This post was last modified on May 13, 2026 8:56 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago