Political News

మోడీ గ్రేట్‌: కూట‌మిని నిలుపుకోవ‌డ‌మూ క‌ళే..!

రాజకీయాల్లో కేవలం పాలన మాత్రమే కాదు.. అధికారాన్ని చలాయించడమే కాదు.. అవసరాన్ని బట్టి.. అవకాశాన్ని బట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించటం అనేది కూడా నాయకులకు కీలకం. ఇలాంటి విషయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ముందుంటారు. మరీ ముఖ్యంగా తనకు మద్దతు ఇచ్చే నాయకులను, మిత్రపక్షాలను కలివిడిగా ఉంచుకోవడంలో మోడీకి చాలా మంచి పేరు కూడా ఉంది.

తాజాగా ఆయన అవిశ్రాంతంగా మూడు రాష్ట్రాల్లో పర్యటించిన సమయంలో కూడా ఎక్కడ ఆయన మిత్ర పక్షాలను వదిలిపెట్టకపోవడం విశేషం. నిజానికి బెంగళూరు పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన ప్రధానమంత్రి ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులను కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచారు. వీరి మద్దతుతోనే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొనసాగుతోంది. అయితే ఈ విషయాన్ని ఎక్కడా ప్రధానమంత్రి బయటకు చెప్పకుండా.. ఆ నాయకులను కలిసి వారి యోగక్షేమాలను తెలుసుకోవడం అత్యంత ఆసక్తికర విషయం.

నిజానికి ఆదివారం ఉదయం వరకు కూడా ప్రధానమంత్రి చంద్రబాబు ఇంటికి కానీ, పవన్ కళ్యాణ్ ఇంటికి కానీ వస్తారన్న సమాచారం గోప్యంగా ఉంచారు. అసలు షెడ్యూల్ లోనే లేదని సమాచారం. అలాంటిది అనూహ్యంగా తన మిత్రులను మరింత మచ్చిక చేసుకునేందుకు మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది వాస్తవం.

అయితే ఇటువంటి అవకాశాలు గతంలో కాంగ్రెస్‌కు కూడా వచ్చాయి. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను కనీసం పన్నెత్తి పలకరించిన పరిస్థితి కూడా లేదు. ఉదాహరణకు 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు యూపీఏ ప్రభుత్వానికి తమిళనాడులోని డిఎంకె పార్టీ అండదండగా నిలిచింది. అదే సమయంలో కరుణానిధి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఆ సమయంలో తమిళనాడు పర్యటనకు వచ్చిన సోనియా గాంధీ కరుణానిధి ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడకుండా ఢిల్లీకి వెళ్లిపోయారు. అంతేకాదు రాజస్థాన్, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల నుంచి తమకు మద్దతు ఇచ్చిన పార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలానే వ్యవహరించింది.

అవసరం మీది అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరించిన ధోరణిని మిత్రపక్షాలు సహించలేకపోయాయి. ఒకానొక దశలో కరుణానిధి వీల్ చైర్ లో ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆనాడు కనీసం ఫోన్ చేస్తే కూడా సోనియాగాంధీ పట్టించుకోలేదని ఢిల్లీలో కరుణానిధి కన్నీరు పెట్టుకున్నారు.

2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో తన కుమార్తె క‌నిమొళి(ప్ర‌స్తుత ఎంపీ)ని అన్యాయంగా జైల్లో పెట్టారని విమర్శించారు. దీనిపై మాట్లాడేందుకు సోనియాగాంధీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని.. దీంతో తాను అనారోగ్యంతో ఉన్నప్పటికీ వీల్ చైర్ లో ఢిల్లీకి వచ్చానని కరుణానిధి చెప్పడం గ‌మ‌నార్హం.

మిత్ర పక్షాలను కేవలం రాజకీయ కోణంలోనే చూడకుండా హృదయానికి హత్తుకునేలా వ్యవహరించడంలో మోడీ అనేక సందర్భాల్లో తన వ్యూహాన్ని అమలు చేశారు. కేవలం ఒకే ఒక్క ఎంపీ ఉన్న పార్టీలను కూడా ఆయన ఆప్యాయంగా పలకరిస్తార‌న‌డంలో అతిశయోక్తి లేదు.

రాజకీయంగా వేరే వ్యూహాలు ఉండవచ్చు.. కానీ ఆత్మీయ పలకరింపులో మాత్రం మోడీని మించిన వారు లేదన్నది రాజకీయ వర్గాలు చెప్పే మాట. ఇప్పుడు కూడా అదే జరిగింది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను ప్ర‌ధాని నేరుగా నివాసానికి వెళ్లి ప‌ల‌క‌రించ‌డం.. కూట‌మిపై మ‌రింత సానుకూల ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 11, 2026 1:14 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

39 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

51 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago