ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఉండడం గమనార్హం. ఒకవైపు రాజకీయంగా బీజేపీపై ఆయన కొట్లాడుతూనే.. దాని ప్రభావం ప్రధాని మోడీపైనా.. కేంద్ర ప్రభుత్వంపైనా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానిని స్వాగతించడం నుంచి సత్కరించడం వరకు రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేశారు.
ఒకవైపు.. తాను అడగాల్సిన ప్రశ్నలను సూటిగానే సభా వేదికపైనే అడుగుతున్నారు. అయితే.. గతంలో కేసీఆర్ తొలినాళ్లలో ప్రధానితో కలివిడిగా వ్యవహరించినా.. తేడా వచ్చిన తర్వాత ఆయన మొహం కూడా చూడలేదు. వాస్తవానికి ధాన్యం కొనుగోళ్ల నుంచి పన్నుల్లో వాటాల వరకు ఇప్పుడు కూడా నాటి పరిస్థితులే ఉన్నాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి నేరుగా తలపడకుండా కర్ర విరక్కుండా.. పాము చావకుండా అన్నట్టుగా సుతిమెత్తగా తన వైఖరిని స్పష్టం చేస్తూ.. ప్రధానిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
అందుకే నేరుగా తెలంగాణకు ఏమీ చేయలేదు.. అందుకే పనులు ముందుకు సాగడం లేదు.. అని కరాఖండీగా చెప్పకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వికసిత్ భారత్ సంకల్పం నెరవేరాలంటే.. తెలంగాణలో కూడా అభివృద్ధి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా మోడీ వైఖరిని ఆయన పరోక్షంగా ప్రశ్నించినట్టు అయింది.
ఇక, దేశంలో తక్కువ జనాభా ఉండి కూడా.. ఎక్కువ మొత్తంలో పన్నులు కడుతున్నామని చెప్పడం ద్వారా కేంద్రం తమకు తక్కువ వాటా ఇస్తోందని ఇది తగదని చెప్పడం గమనార్హం. మొత్తంగా గతంలో కేసీఆర్ అనుసరించిన వైఖరికి భిన్నమైన వైఖరి తీసుకుని మోడీని మెప్పించేలా ముందుకు సాగారన్నది చర్చకు వస్తోంది.
ఘన సత్కారం..
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగానే సత్కరించారు. అసలు సభకు కూడా వస్తారో రారో అన్న సందేహాలను పటాపంచలు చేసి.. సభకు వచ్చిన రేవంత్ రెడ్డి.. 10 కిలోల వెండితో రూపొందించిన నంది విగ్రహాన్ని ప్రధానికి కానుకగా ఇచ్చారు.
అలాగే.. తెలంగాణకు ప్రత్యేకమైన పోచంపల్లి పట్టు వస్త్రాన్ని ఆయనకు అలంకరించి.. తెలంగాణ సంప్రదాయాన్ని పాటించారు. అదేసమయంలో హద్దు మీరి పొగడనూ లేదు. అలాగని ఎక్కడా విమర్శించనూ లేదు. దీంతో ప్రధాని సభలో రేవంత్ రెడ్డి అనుసరించిన భిన్నమైన వైఖరి స్పష్టంగా కనిపించింది..
This post was last modified on May 11, 2026 12:52 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…