Political News

విజయ్‌కి దినదిన గండమేనా?

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మూణ్నాలుగు రోజులుగా నడుస్తున్న సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ విజయ్‌కి అవకాశమిచ్చాడు. సొంతంగా సాధించిన 108 స్థానాలకు తోడు.. ఇంకో 12 మంది మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ‘సి.జోసెఫ్ విజయ్‌ అనుం నాన్’ అంటూ స్వచ్ఛమైన తమిళంలో విజయ్ చేసిన ప్రమాణ స్వీకారం తన అభిమానులు, టీవీకే కార్యకర్తలను అమితంగా ఆకట్టుకుంది.

ఐతే విజయ్ సీఎంగా ప్రమాణం చేయడం బాగానే ఉంది కానీ.. అతడికి ముందుంది ముసళ్ల పండగ అంటూ సామాజిక మాధ్యమాల్లో చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మెజారిటీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయని.. అందులో ముగ్గురు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వ కూలిపోతుందని.. కాబట్టి విజయ్‌ ప్రభుత్వానికి దినదిన గండమే అని.. మద్దతుగా నిలిచిన పార్టీలు అతణ్ని ఒక ఆట ఆడుకుంటాయని చాలామంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

కానీ నిజంగా విజయ్ అంత ఇబ్బంది ఎదుర్కొంటాడని అనుభవజ్ఞులైన రాజకీయ విశ్లేషకులు భావించట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు జంప్ అవ్వడం సర్వ సాధారణం. ఆల్రెడీ అన్నా డీఎంకే పార్టీలో సగం మందికి పైగా ఎమ్మెల్యేలు విజయ్‌కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

ఒక దశలో పార్టీని చీల్చి విజయ్‌తో వెళ్లడానికి కొందరు నాయకులు రెడీ అయ్యారు కూడా. కాబట్టి విజయ్ సీఎం అయిపోయాడు కాబట్టి.. రేప్పొద్దున ఆ పార్టీ నుంచి టీవీకే వచ్చే నేతలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటారనడంలో సందేహం లేదు.

విజయ్ కూడా సుస్థిర ప్రభుత్వం కోసం వలసలను ప్రోత్సహించకుండా ఉండలేడు. లేదంటే ఇప్పుడు మద్దతుగా నిలిచిన నేతలు గొంతెమ్మ కోరికలతో ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండరు. కాకపోతే గవర్నర్ అధికార పార్టీకి చెందిన వాడైతే.. జంపింగ్ జపాంగ్‌ల విషయంలో లైట్ తీసుకుని ఉండిపోతాడు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పని చేసే గవర్నర్ ఉన్నాడు కాబట్టి.. వలస నేతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడు. అనర్హత వేటు కూడా వేసేయొచ్చు.

ఈ విషయంలో విజయ్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తాడనడంలో సందేహం లేదు. తనకు మద్దతుగా నిలవాలనుకునే నేతలు రాజీనామా చేసి రావాలని షరతు పెట్టొచ్చు. లేదా అనర్హత వేటు పడ్డాక తన పార్టీ తరఫున పోటీ చేయించొచ్చు.

విజయ్ గెలుస్తాడో లేదో తెలియని పరిస్థితుల్లోనే అతడి పార్టీ అభ్యర్థులను ఈ స్థాయిలో గెలిపించిన జనం.. అతడి ప్రభుత్వ సుస్థిరత కోసం రాజీనామా చేసి వచ్చే ఎమ్మెల్యేలను ఘనంగా గెలిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి తమిళనాట రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశాలు తక్కువ. విజయ్ ఐదేళ్లు సీఎంగా ఉండడం ఖాయం.

This post was last modified on May 11, 2026 12:16 am

Share

Recent Posts

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

2 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

3 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

3 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

6 hours ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

6 hours ago

విమానంలోనే కాక్రోచ్ నాయకుడి అరెస్టు

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…

7 hours ago