Political News

ముఖ్య‌మంత్రిగా మూడు సంత‌కాలు.. విజ‌య్ అద‌ర‌హో!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా టీవీకే పార్టీ(త‌మిళ వెట్రిగ క‌ళ‌గం) అధినేత సీ. జోసెఫ్ విజ‌య్ ఆదివారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్‌.. ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. విజ‌య్‌తోపాటు.. సీనియ‌ర్ నాయ‌కులు కూడా కొంద‌రు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు.

అయితే.. తొలిరోజే విజ‌య్‌.. మూడు కీల‌క హామీల‌పై సంత‌కాలు చేసి అద‌ర‌హో అనిపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తూ.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంత‌కం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటుపై రెండో సంత‌కం చేశారు. త‌ద్వారా రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్న సంకేతాన్ని ఆయ‌న తొలిరోజే పంపించారు.

ఇక‌, దేశాన్ని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల‌కు త‌ల‌నొప్పిగా మారిన డ్ర‌గ్స్ భూతాన్ని త‌రిమికొట్టేందుకు.. ఉద్దేశించిన వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసే ఫైలుపై మూడో సంత‌కం చేశారు. త‌ద్వారా ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణలో ఉన్న ఈగ‌ల్‌ వంటివ్య‌వ‌స్థ‌ను విజ‌య్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. ఈ మూడు హామీల‌ను కూడా.. విజ‌య్ ఎన్నిక‌లకు ముందే ప్ర‌క‌టించారు. తాజాగా వీటిని అమ‌లుచేస్తూ.. విజ‌య్ సంత‌కాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

కాగా, విజ‌య్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కుడు, లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తోపాటు ప‌లువురు కాంగ్రెస్ ప్ర‌ముఖ నాయ‌కులు కూడా వ‌చ్చారు. వీరితో విజ‌య్ స్వ‌యంగా సెల్ఫీలు తీసుకున్నారు. వీడియో చిత్రించారు. ఇక‌, ప్ర‌మాణ స్వీకారం అనంతరం.. గ‌వ‌ర్న‌ర్ అర్లేక‌ర్‌.. విజ‌య్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. పుష్ప‌గుచ్ఛాలు అందించి.. మంచి పాల‌న అందించాల‌ని సూచించారు. ప్ర‌దాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా.. ఎక్స్‌లో శుభాకాంక్ష‌లు తెలిపారు.

This post was last modified on May 11, 2026 12:25 am

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మరో షాక్

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు మరో సమస్య ఎదురైంది. అమెరికా కార్మిక శాఖ కాగ్నిజెంట్ నుంచి వచ్చే…

35 minutes ago

అరుణాచల్ స్వతంత్ర ప్రదేశమా…?వరల్డ్ మ్యాప్ లో వివాదం!

ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదంగా మారింది. భారత దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని స్వతంత్ర…

3 hours ago

ఓటీటీలతో ఆటలు బహు ప్రమాదకరం

కరోనా సమయంలో ‘‘భలే మంచి ఓటీటీ బేరము’’ అని పాడుకున్నాయి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు. మిగతా భాషల చిత్రాలకు కూడా…

4 hours ago

అన్ని స‌ర్వేల‌దీ అదే దారి.. వైసీపీ మౌనం అందుకేనా?

రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవ‌రికి ద‌క్కుతుంది? అనే…

6 hours ago

నాడు చెల్లి.. నేడు మిత్రుడు.. జ‌గ‌న్‌కు సెగ పెంచేస్తున్నారు!

ఏపీ విప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీలో అంత‌ర్గ‌త పోరు ఎక్కువ‌గా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా…

7 hours ago

ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌.. ల‌క్ష‌ల మంది వీధిపాలు.. కార‌ణాలేంటి?

ఒక‌టి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. ల‌క్ష‌ల్లోనే ఉద్యోగాలకు ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లు మంగ‌ళం పాడుతున్నాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫోక్స్…

10 hours ago