ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల జాబితాలో ప్రధాని మోదీ టాప్ 10 లో ఉంటారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే భారత్ మరో రేంజ్ కు వెళ్లిందంటే అతిశయోక్తి కాదు. అటువంటి పవర్ ఫుల్ లీడర్ అయిన మోదీకి ఏపీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు మోదీ అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రాధాన్యతను మోదీ నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల నివాసాలకు మోదీ వెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పవన్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ ను మోదీ పరామర్శించారు. పవన్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నివాసానికి కూడా మోదీ వెళ్లారు. మోదీకి మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు.
చంద్రబాబుతో మోదీ దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని సమకాలీన రాజకీయాలపై, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి పలు అంశాలపై చంద్రబాబుతో మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల ఇళ్లకు మోదీ వెళ్లడంతో ఆ ఇద్దరికీ మోదీ ఎంత ప్రాధాన్యతనిస్తారో మరోసారి నిరూపితమైంది.
This post was last modified on May 10, 2026 11:26 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…