Movie News

తొమ్మిది డ్రాఫ్టులు… మూడు క్లైమాక్స్‌లు

మొదట నటుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరి.. తర్వాత దర్శకుడిగా మారుతుంటే తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. నటన నుంచి దర్శకత్వంలోకి అడుగుపెట్టిన వాళ్ల మీద మరీ ఎక్కువ అంచనాలేమీ ఉండవు. కానీ వెంకీ మాత్రం తాను యాక్సిడెంటల్ యాక్టర్ అని, బేసిగ్గా మంచి రైటర్ కమ్ డైరెక్టర్ అని తొలి చిత్రం ‘తొలి ప్రేమ’తోనే రుజువు చేశాడు.

తర్వాతి రెండు చిత్రాలు మిస్టర్ మజ్ను, రంగ్ దే నిరాశపరిచినా.. ఆపై సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో గొప్ప పేరే సంపాదించాడు. దర్శకుడిగా ఒక గౌరవం సంపాదించాడు. ఇప్పుడు సూర్య లాంటి పెద్ద హీరోతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ చేశాడు వెంకీ. ఐతే సూర్యతో సినిమా అనేసరికి చాలా జాగ్రత్త పడ్డానని.. స్క్రిప్టు విషయంలో తన కెరీర్లో మరే చిత్రానికీ చేయనంత కసరత్తు చేశానని అంటున్నాడు వెంకీ.

తాను అత్యంత సుదీర్ఘ కాలం రాసిన స్క్రిప్టు ఇదేనన్న వెంకీ.. రకరకాల వెర్షన్లతో ఏకంగా తొమ్మిది డ్రాఫ్టులు రెడీ చేసినట్లు తెలిపాడు. ఫైనల్‌గా ఒక వెర్షన్ ఓకే చేశాక కూడా క్లైమాక్స్ విషయంలో మళ్లీ తర్జన భర్జనలు జరిగినట్లు తెలిపాడు. మూడు రకాల క్లైమాక్సులు రాసి.. సూర్య ముందు పెట్టానని, అందులోంచి ది బెస్ట్‌ను ఆయన ఓకే చేశారని, క్లైమాక్స్ ఆయన ఛాయిసే అని తెలిపాడు వెంకీ. సూర్య సరసన మామిత బైజు నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందకు రానున్న సంగతి తెలిసిందే.

ఇక తన తర్వాతి సినిమా గురించి చెబుతూ.. ‘సార్’ తర్వాత మళ్లీ ధనుష్‌తో ఒక సినిమా చేయాలనుకుంటున్నానని.. ఆ స్క్రిప్టు రెడీ అయి, సినిమా పట్టాలెక్కేందుకు రెండేళ్లు పట్టొచ్చని వెంకీ అన్నాడు. ఇది పోలీస్ కథ అని, దాని లైన్ ధనుష్‌ ఓకే చేశాడని, కానీ అతను బేసిగ్గా రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి.. ఆయన్ని మెప్పించేలా కథ తయారు చేయాలంటే టైం పడుతుందని వెంకీ అన్నాడు.

This post was last modified on July 30, 2026 9:47 am

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago