Political News

‘కాంగ్రెస్‌… మావోయిస్టు పార్టీ కంటే దారుణం’

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జ‌రిగిన బీజేపీ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీని మావోయిస్టుల కంటే దారుణ‌మైన పార్టీగా అభివ‌ర్ణించారు. వాస్త‌వానికి ఆదివారం ఆయ‌న బెంగ‌ళూరులో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా కాంగ్రెస్‌పార్టీపై విరుచుకుప‌డ్డారు. డీఎంకే పార్టీకి వెన్నుపోటు పొడిచిన పార్టీగా అభివర్ణించారు. తాజాగా సాయంత్రం సికింద్రాబాద్‌లో నిర్వ‌హించిన స‌భ‌లోనూ కాంగ్రెస్‌ను మ‌రింత ఎక్కువ‌గా ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాంగ్రెస్ వామపక్ష పార్టీల కంటే కూడా మరింత ‘వామపక్షంగా మారిందని అన్నారు. అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక కఠోరమైన, వక్రీకరించబడిన మావోయిస్టు సంస్థగా తయారైంద‌ని ప్ర‌ధాని దుయ్య‌బ‌ట్టారు. అంతేకాదు.. మత ఛాందసవాదంలో ముస్లిం లీగ్‌ను సైతం అధిగమించి పోయింద‌న్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీనే ముస్లిం లీగ్‌గా రూపాంతరం చెందిందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనిఎంఎంసి` అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంఎంసి అంటే ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్…అని మోడీ కొత్త అర్థం చెప్పారు. ఇలాంటి పార్టీకి ప్ర‌జ‌లు ఎప్పుడో స‌మాధి క‌ట్టార‌ని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రుణం తీర్చుకోలేనిది!

తెలంగాణ ప్ర‌జ‌ల రుణం తీర్చుకోలేనిద‌ని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు. దేశం మొత్తం మీద బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నప్పుడు, క‌మ‌లం పార్టీకి ఒక ఎంపీని అందించిన గడ్డ తెలంగాణ అని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఏమాత్రం మద్దతు లేనప్పుడు కూడా… బీజేపీకి తెలంగాణ మద్దతు లభించింద‌ని గుర్తు చేశారు. ఇప్పుడు ఇక్కడి ఎంపీలలో దాదాపు సగం మంది బీజేపీకి చెందినవారే ఉన్నార‌ని తెలిపారు. (మొత్తం 17 మంది ఎంపీలో 8 మంది బీజేపీ స‌భ్యులు). ‘వలీ బార్, ప్రచండ్ బహుమత్ సే, యహా భీ’ (మళ్ళీ వచ్చేసారి, ప్రచంచ‌ బహుమతి ల‌భిస్తుంది) అని వ్యాఖ్యానించారు.

మోడీ స‌ర్కార్ నినాదాల హోరు..

తెలంగాణ ప్రజలపైనా, రాష్ట్ర బీజేపీ కార్యకర్తలపైనా త‌న‌కు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అయితే.. ఈ స‌మ‌యంలో స‌భ‌కు హాజ‌రైన జనసమూహం నుంచి మోడీ సర్కార్ అనే నానాదాలు వినిపించ‌డంతో ప్ర‌ధాని ఒక్క‌నిమిషం త‌న ప్ర‌సంగాన్ని నిలువ రించి.. వారి నినాదాల‌ను ఆస‌క్తిగా ఆల‌క‌రించారు. అనంత‌రం ఆయ‌న త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. ప్ర‌జ‌ల ఉత్సాహం చూస్తుంటే.. ఇక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు ఖాయ‌మ‌ని అన్నారు. అంతేకాదు.. ఒకప్పుడు, దక్షిణం నుండి ఈశాన్యం వరకు, బీజేపీని ఒక అల్పసంఖ్యాక పార్టీగా(మైనారిటీ) పరిగణించేవారని అన్నారు. కానీ నేడు ఒక సిద్ధాంతం దేశానికి అంకితమైతే, దాని గర్జన ప్రతిధ్వనిని ఏ సరిహద్దులూ అడ్డుకోలేవని ప్రజల త‌మ తీర్పు ద్వారా చెబుతున్నార‌ని అన్నారు.

This post was last modified on May 10, 2026 10:48 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago