Political News

తమిళనాట పాడిన వందే మాతరం… బెంగాల్ లో లేదెందుకు?

వందేమాతరం ఆలపించడంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ప్రధాని ప్రమాణ స్వీకారం, పౌర పురస్కారాలు అందించే కార్యక్రమాలు, రాష్ట్రపతి పాల్గొనే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, తమిళనాడు చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వందేమాతరం ఆలపించిన దాఖలాలు లేవు.

దీంతో, సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వందేమాతరం పాడతారా లేదా అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది. కానీ, అనూహ్యంగా విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వందేమాతరం ఆలపించారు. ఆ తర్వాత ‘జనగణమన’, ‘తమిళ తల్లి’ గీతాలను ఆలపించారు. ఇటీవల కేంద్రం ఉత్తర్వులో జారీ చేసిన విధంగా వందేమాతరంలోని మొత్తం 6 చరణాలనూ పాడడం విశేషం.

అయితే, పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి మాత్రం వందేమాతరం ఆలపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో, బీజేపీ అధికారంలో ఉన్న బెంగాల్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులను బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే పాటించకపోతే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే, విజయ్ వందేమాతం పాడకపోయి ఉంటే బీజేపీ నేతలు ఈ పాటికి నానా రచ్చ చేసేవారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

This post was last modified on May 10, 2026 7:22 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

2 minutes ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago