ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన టీవీకే.. అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన‌.. మెజారిటీ సీట్ల విష‌యంలో కొద్ది దూరంలో నిలిచిపోయిం ది. దీంతో 10 మంది ఎమ్మెల్యేల మద్ద‌తు కూడ‌గ‌ట్టే విష‌యంలో పెద్ద ఎత్తున చిక్కులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే గ‌వ‌ర్న‌ర్ నుంచి కూడా విజ‌య్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంది. రాజ్యాంగ‌ప‌ర‌మైన స్థానంలో ఉన్న రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్‌.. అసెంబ్లీలో తేల్చుకోవాల్సిన బ‌ల‌నిరూప‌ణ‌ను లోక్‌భ‌వ‌న్ వేదిక‌గా మార్చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఇదిలావుంటే.. తాజాగా 2 సీట్లు గెలుచుకున్న‌ వీసీకే పార్టీ విజ‌య్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో అధికారికంగా లేఖను కూడా స‌మ‌ర్పించింది. ఇక‌, ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ 5. సీపీఎం 2, సీపీఐ 2 స్థానాలు.. ఇలా ఈ మూడు కూడా టీవీకేకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం టీవీకేకు 108+5+2+2+2 = 119 స్థానాలు ద‌క్కిన‌ట్టు అయింది. మేజిక్ ఫిగ‌ర్ 118గా ఉన్న నేప‌థ్యంలో టీవీకేకు ఇప్పుడు స‌మ‌కూరిన బ‌లం స‌రిపోతుంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్‌.. తాజాగా శ‌నివారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి.. మ‌రోసారి విన్న‌వించే ప్ర‌య‌త్నం చేశారు.

త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన పార్టీల జాబితాతోపాటు.. ఎమ్మెల్యేల పేర్లతో కూడిన నివేదిక‌ను కూడా గ‌వ‌ర్న‌ర్‌కు అందించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు తిప్పిపంపిన గ‌వ‌ర్న‌ర్ అర్లేక‌ర్‌.. తాజాగా మాత్రం విజ‌య్‌కు కండువా క‌ప్పేశారు. అంటే… ఆయ‌న ప్ర‌భుత్వ ఏర్పాటుకు అంగీక‌రించారు.

నిజానికి గ‌త మూడు రోజులుగా వ‌రుస‌గా విజ‌య్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డం.. శాలువా క‌ప్పి.. బొకేలు అందించ‌డం తెలిసిందే. దీనిపైనా సెటైర్లు ప‌డ్డాయి. గ‌వ‌ర్న‌ర్‌కు శాలువాలు.. బొకేలు కూడా వేస్ట్ అంటూ.. నెటిజ‌న్లు మండిప‌డ్డారు. ఇక‌. ఈ మూడు సార్లు కూడా విజ‌య్‌కు గ‌వ‌ర్న‌ర్ నుంచి ఎలాంటి కానుక‌లు రాలేదు. కానీ, శ‌నివారం సాయంత్రం మాత్రం.. గ‌వ‌ర్న‌ర్ విజ‌య్‌కు కండువాక‌ప్పారు. అంటే ఆయ‌న ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పారు.

ఉద‌యం 10 గంట‌ల‌కే..

ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని కూడా గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం తాజాగా శ‌నివారం రాత్రి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ముఖ్య‌మంత్రిగా విజ‌య్‌ను అప్పాయింట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ప‌లు పార్టీలు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నాయ‌ని.. వాటి ఆధారంగానే కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు చేయడానికి అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు తెలిపింది.