Political News

డీఎంకే-అన్నాడీఎంకేల‌లో చీలిక‌… రీజన్ ఒకడే!

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ టీవీకే 108 స్థానాల‌కు ప‌రిమితం కావ‌డం.. ఆయ‌న పార్టీకి ఎలా ఉన్న ప్పటికీ.. ప్ర‌ధాన ప‌క్షాలైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌లో చీలిక‌లు తీసుకువ‌చ్చేందుకు దారి తీసింది. డీఎంకే మిత్రప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌పార్టీ.. టీవీకేతో చేతులుక‌లిపేందుకు రెడీ అయింది. వాస్త‌వానికి డీఎంకే-కాంగ్రెస్‌లు.. జాతీయ మిత్ర ప‌క్ష‌మైన ఇండియా కూట‌మిలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నా డు ఎన్నిక‌ల‌కు ముందు టీవీకే చేతులు క‌లిపేందుకు ప్ర‌య‌త్నించినా.. కాంగ్రెస్ వెన‌క్కి త‌గ్గింది.

అయితే.. ఇప్పుడు త‌మిళ‌నాడులో మారిన ప‌రిస్థితి, డీఎంకేను ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మైంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో 38 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లోవిజ‌యం ద‌క్కించుకుంది. ఇప్పుడు ఈ ఐదుగురు ఎమ్మెల్యేల‌ను కూడా టీవీకేకు మ‌ద్ద‌తు ఇచ్చేలా వ్యూహాత్మ‌కంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. త‌ద్వారా.. మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌డంతో పాటు రాజ్య‌స‌భ స్థానాన్ని కూడా ఆశిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇక‌, మాజీ సీఎం ప‌ళ‌నిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేలో కూడా చీలిక రాజ‌కీయాలు తెర‌మీదకి వ‌చ్చాయి. ఈ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తాజాగా ఎన్నిక‌ల‌కు దిగింది. అయితే.. రెండో స్థానాన్ని కూడా కోల్పోయి.. కేవ‌లం 59 స్థానాల‌కే ప‌రిమితం అయింది. దీంతో అన్నాడీఎంకేలోని 15 మంది నుంచి 20 మంది వ‌ర‌కు ఎమ్మెల్యేలు.. టీవీకేతో జ‌ట్టు క‌ట్టేలా.. పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన పార్టీ ప‌క్ష స‌మావేశంలోనూ ఇదే ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు.

అయితే.. ఈప్ర‌తిపాద‌న‌కు ప‌ళ‌ని స్వామి తిర‌స్క‌రించారు. దీంతో బుధ‌వారం 15 మందిఎమ్మెల్యేలు.. టీవీకే పార్టీకి తాము మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. విజ‌య్‌కు వ‌ర్త‌మానం పంపించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే జరిగితే.. అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఖాయ‌మ‌ని అంటున్నారు. అటు డీఎంకేలోని మిత్ర ప‌క్షం కాంగ్రెస్ బ‌య‌ట‌కు రావ‌డం.. ఇటు అన్నాడీఎంకేలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసేందుకురెడీ కావ‌డంతో త‌మిళ‌నాట రాజ‌కీయాలు మ‌రింత ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 7, 2026 9:53 pm

Share

Recent Posts

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

41 minutes ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

2 hours ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

2 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

3 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

3 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

3 hours ago