Political News

విజయ్‌ విషయంలో వైసీపీ ఇప్పుడేం చేస్తుంది?

తమిళనాట పార్టీ పెట్టిన రెండేళ్లకే అద్భుత విజయంతో సీఎం కుర్చీలో కూర్చోబోతున్నాడు విజయ్. ఆయన మీద దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ముఖ్య నేతలు విజయ్‌కి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ విజయ్ విజయాన్ని స్వాగతించారు. ఐతే ఏపీలో వైసీపీ వాళ్లు మాత్రం ఈ విజయం తమదే అన్నట్లు పొంగిపోతున్నారు. తమ నాయకుడే గెలిచినంత హడావుడి చేస్తున్నారు.

ఏదో ఒక పెళ్లి వేడుకలో భాగంగా విజయ్‌, జగన్ పక్క పక్కన కూర్చున్నారని.. ఒక మీటింగ్‌లో ఎవరో అభిమాని జగన్ ఫొటో ఇస్తే దాన్ని విజయ్ చేతిలో పట్టుకున్నాడని.. జగన్‌, విజయ్ ఒకే మతానికి చెందిన వారని.. ఇలాంటి కారణాలతో విజయ్‌ని వైసీపీ వాళ్లు ఓన్ చేసుకుంటున్నారు. నిజానికి జగన్ ఏమీ విజయ్‌కి బహిరంగ మద్దతు ప్రకటించలేదన్న స్పష్టం.

జగన్ అదే పెళ్లి వేడుకలో డీఎంకే అధినేత స్టాలిన్‌ను, మరో సందర్భంలో ఏఐడీఎంకే పార్టీ నేత పళనిస్వామిని కూడా కలిసిన సంగతి మాత్రం విస్మరిస్తున్నారు. ఒకవేళ వాళ్లలో ఎవరైనా గెలిచినా.. జగన్ ఫ్యాన్స్ ఇలాగే ఓన్ చేసుకుని ఎలివేషన్లు వేసేవారంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

మూడు రోజులుగా విజయ్ విజయాన్ని కొనియాడుతూ.. జగన్‌కు, విజయ్‌కి ఉన్న పోలికలు చెప్పుకుంటూ మామూలు ఎలివేషన్లు ఇవ్వట్లేదు వైసీపీ ఫ్యాన్స్. వాళ్లు ఇంతగా ఓన్ చేసుకున్న విజయ్ చివరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడం చూసి వైసీపీ వాళ్లకు నోరు పెగలట్లేదు.

జగన్‌కు కాంగ్రెస్ అంటే ఎంత వ్యతిరేకతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తండ్రి మరణానంతరం ఆ పార్టీ తనను సీఎంను చేయలేదని.. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాక తన మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిందని.. తనతో విభేదించి బంధాన్ని తెంచుకున్న షర్మిళను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేసి తన మీద ఉసిగొల్పిందని.. ఇలా రకరకాల కారణాలతో కాంగ్రెస్ పార్టీ అంటే జగన్‌కు అస్సలు పడదు.

కానీ ఇప్పుడు విజయ్.. ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. రేప్పొద్దున ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కూడా వస్తాడనడంలో సందేహం లేదు. షర్మిళ కూడా వెళ్లినా ఆశ్చర్యం లేదు. మరి ఇప్పటిదాకా విజయ్‌ తమ నేతకు ఆప్త మిత్రుడు అన్నట్లు చెప్పుకుని, ఇద్దరికీ పోలికలు పెట్టుకుని.. ఎలివేషన్లు వేసుకున్న వైసీపీ వాళ్లు ఇప్పుడెలా స్పందిస్తారన్నది ఆసక్తికరం.

This post was last modified on May 7, 2026 1:09 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

20 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago