Movie News

మెగా ట్రీట్… ఏ కానుక ఇవ్వబోతున్నారు

ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్ సెలెబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అసలే ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారు రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది. రెండున్నరేళ్ళ గ్యాప్ కి న్యాయం చేకూర్చింది. ఇప్పుడు అందరి కళ్ళు బర్త్ డే రోజు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారనే దాని మీద ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 టీజర్ రావడం పక్కా. ఇంకా కట్ చేయలేదు కానీ త్వరలోనే పూర్తవుతుందని తమన్ ఇటీవలే చెప్పారు.

టైటిల్ రివీల్ తో పాటు సినిమా కాన్సెప్ట్ పరిచయం చేసేలా ఒక స్టయిలిష్ ప్రోమో రావడం ఖాయమే. అయితే ఇది కాదు అసలు టాపిక్. ఏళ్ళ తరబడి విఎఫ్ఎక్స్ క్వాలిటీతో పోరాటం చేస్తున్న విశ్వంభర నుంచి రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అంతర్గత సమాచారమైతే అక్టోబర్ 15 టార్గెట్ గా చేసుకుని రంగం సిద్ధం చేస్తున్నారట. అంటే రజనీకాంత్ జైలర్ 2తో క్లాష్ అయినా పర్లేదని, అంత బలమైన కంటెంట్ కుదిరిందని యువి క్రియేషన్స్ ధీమాగా ఉన్నట్టు తెలిసింది.

అయితే ఏదైనా ప్రకటన వచ్చేదాకా దీన్ని నమ్మలేం. ఇప్పటికే వాయిదాల పర్వంలో నలిగిపోయి విశ్వంభర మీద బజ్ చాలా తగ్గిపోయింది. గత ఏడాది ఒక పాట విడుదలైన సంగతి కూడా జనాలు మర్చిపోయారంటే ఏ స్థాయిలో రీచ్ పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు పండగలకో పబ్బాలకో కనీసం కొత్త పోస్టర్ వదిలినా ఇలాంటి డిస్కషన్స్ ఉండేవి కాదు కానీ నిమ్మకు నీరెత్తనట్టు ప్రతిసారి మౌనంగా ఉండటం చాలా డ్యామేజ్ చేసింది.

ఒకటి మాత్రం నిజం. మెగా 158 సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతోంది. బాబీ మరోసారి వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ రిపీట్ చేస్తూ అంతకన్నా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు. అటువైపు విశ్వంభర దర్శకుడు వశిష్ట అప్పుడప్పుడు బయట ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు కానీ తన సినిమా ఊసే ఎత్తడం లేదు. మొత్తానికి రెండు మెగా ట్రీట్స్ రావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళ కోరికకు తగ్గట్టు అవి నెరవేరుతాయా లేక ఒకదానితో సర్దుకోవాలో లెట్ వెయిట్ అండ్ సీ. 

This post was last modified on July 29, 2026 3:04 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

34 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago