Political News

వైసీపీలో మావిగన్ ర‌చ్చ ఇంకా స‌మ‌సిపోలేదా..?

వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన వ్యవహారం ఆ పార్టీలోనే చిచ్చు పెడుతున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది నాయకులు జగన్ చేసిన ప్రకటనను గుడ్డిగా సమర్థిస్తూ.. ఆయన వెంట నడుస్తామని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని.. ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పలువురు నేతల్లో వ్యక్తమవుతోంది.

ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన సోదరులు సైతం మావిగన్ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయంలో ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని.. ఎవరి సలహా మేరకు ముందుకు వెళ్లారని ధర్మాన ప్రసాదరావు అంతర్గత చర్చల్లో ప్రశ్నించినట్టు చెబుతున్నారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ రెడ్డి నాయకుడు కూడా మావిగన్ ప్రకటన సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. పార్టీలో సీనియర్లు ఉన్నప్పటికీ వారితో కనీసం చర్చించాలనే ఆలోచన కూడా జగన్ కు లేకపోతే ఇక తమ పరిస్థితి ఏమిటని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

పార్టీ నిర్ణయాలను పాటించడంలో ఎలాంటి సందేహం లేదని.. కానీ వాటిని ప్రజల్లో సమర్థించడం మాత్రం కష్టంగా మారుతోందని కొందరు నేతలు అంటున్నారు. ఇప్పటికే ప్రజలు అమరావతి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశారని.. ఇప్పుడు వారిని మావిగన్ వైపు ఎలా మళ్లించగలమని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికే ఈ ప్రకటన చేసినట్టుగా ప్రజల్లో భావన ఏర్పడుతోందని.. ఇలాంటి పరిస్థితిలో మావిగన్ అంశాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదే ఇప్పుడు వైసీపీలో చాలామంది సీనియర్ నేతల ఆందోళనగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది నేతలు ఇటీవల ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం. మావిగన్‌కు మద్దతుగా ఉన్నవారు ఎంతమంది.. వ్యతిరేకంగా ఉన్నవారు ఎంతమంది అనే అంశంపైనా ఆరా తీసినట్టు తెలుస్తోంది.

ఏదేమైనా.. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పార్టీలో విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం నేతల్లో పెరుగుతోంది. అయితే తాడేపల్లి ప్యాలెస్ లోని ఒకరిద్దరి చుట్టూనే నిర్ణయాలు పరిమితమవుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు విఫలం కావడంతో.. ఇప్పుడు పార్టీలో అంతర్గత అసంతృప్తి మరింత బయటపడుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

This post was last modified on May 7, 2026 11:19 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

3 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

4 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

4 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

5 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

6 hours ago