Political News

ఎన్టీఆర్, ఎంజీఆర్.. మధ్యలో విజయ్

దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ముందుంటాయి. తమిళనాట ముఖ్యమంత్రులుగా సుదీర్ఘ కాలం పాలన చేసిన కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ముగ్గురూ సినిమా వాళ్లే. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టే దిశగా దూసుకెళ్తున్న విజయ్ కూడా సినిమా వాడే. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మెగాస్టార్ చిరంజీవి అధికారంలోకి రాలేకపోయినా.. మంచి ఫలితాలే రాబట్టారు. పవన్ కళ్యాణ్ ఒక ఎన్నికలో ఎదురు దెబ్బ తిన్నాక, రెండో ప్రయత్నంలో డిప్యూటీ సీఎం అయ్యారు.

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి అద్భుత ఫలితాలు రాబట్టిన వారిలో విజయ్ స్థానం ఎక్కడ అన్నది ఆసక్తికరం. ఈ ఒరవడిలో ఎప్పటికీ నందమూరి తారక రామారావుదే అగ్రస్థానం. ఆయన రికార్డును బద్దలు కొట్టడం ఇంకెవరికీ సాధ్యం కాకపోవచ్చు కూడా. ఆయన 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీని పెట్టి.. తర్వాతి ఏడాది జనవరికే ముఖ్యమంత్రి అయిపోయారు. పార్టీ పెట్టాక కేవలం తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారం చేపట్టారు. 2009 ఎన్నికల్లో ఈ రికార్డును బద్దలు కొట్టాలన్న టార్గెట్‌తో పార్టీ పెట్టిన 8 నెలల్లోనే సీఎం అవ్వాలని చిరంజీవి ప్రయత్నించారు కానీ.. ఆయన కల నెరవేరలేదు.

తమిళనాడులో ఇప్పటిదాకా పార్టీ పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలో సీఎం అయింది ఎంజీఆర్. అప్పటికే డీఎంకే పార్టీలో ఎమ్మెల్యే అయి ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న ఎంజీఆర్, తర్వాత కరుణానిధితో విభేదించి 1972లో అన్నాడీఎంకే పార్టీ పెట్టారు. ఇంకో ఐదేళ్లకు 1977లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకు సీఎం అవుతున్నారు. అంటే ఎంజీఆర్ కంటే ఆయనది గొప్ప విజయంగా చెప్పాలి. కానీ ఎన్టీఆర్‌ తర్వాత పార్టీ పెట్టాక అతి తక్కువ సమయంలో సీఎం అయిన నేతల్లో ఆయన రెండో స్థానంలో నిలుస్తారు. ఈ స్థానాల్లో ఇక మార్పు రావడం అన్నది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

This post was last modified on May 5, 2026 8:03 am

Share

Recent Posts

సంక్రాంతి థియేటర్ల కోసం యుద్ధాలు చేయాలేమో

ఇంకా నాలుగు నెలలు ఉండగానే 2027 సంక్రాంతి గురించి ఇండస్ట్రీ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లలో విపరీతమైన చర్చలు మొదలయ్యాయి. నేనంటే నేనంటూ…

8 hours ago

నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం… టిబెట్‌పై చైనా కుట్ర చేసిందా?!

భార‌త పోరుగు దేశం, దేవ‌భూమి నేపాల్‌లో ఒక్క‌సారిగా సంభ‌వించిన జ‌ల ప్ర‌ళ‌యం.. ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఒక్క‌సారిగా ఉప్పొంగిన కోశీ…

9 hours ago

తక్కువ బడ్జెట్ హనుమాన్… హిట్టు కొట్టేసింది  

మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…

10 hours ago

రవితేజ ఇకపై మరింత జాగ్రత్తగా

వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…

11 hours ago

సందీప్ వంగ ప్రభావం ఆ స్థాయిలో ఉంది

తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…

12 hours ago

పులివెందుల టికెట్ వదులుకుంటారా జగన్ సార్?

ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప్ర‌క‌ట‌నల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. స‌మ‌యం వ‌చ్చింద‌నో.. సంద‌ర్భం చిక్కింద‌నో…

12 hours ago