Political News

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి కాగా… సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో విజేతలెవరన్న విషయం సోమవారం మధ్యాహ్నంలోగా తేలిపోతుంది.

హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో విజయంపై పెద్ద ఎత్తున బెట్టింగులకు జరుగతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఆయా రాష్ట్ర పరిస్థితులు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా సాగుతున్న ఈ బెట్టింగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. భారీ ఎత్తున బెట్టింగులు జరగడంతో ఫలితాల వెల్లడికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఐదు రాష్ట్రాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ ఎన్నికల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 15 ఏళ్ల పాటు ఆ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా నాలుగోసాఃరి కూడా విజయం సాధిస్తానన్న ధీమాతో సాగుతున్నారు.

అయితే 15 ఏళ్ల పాటు మమత పాలనను చూసిన బెంగాల్ ఓటర్లు ఈ దఫా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్, బీజేపీల మధ్య బెంగాల్ లో టఫ్ ఫైటే జరిగంది. ఈ నేపథ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఫలితాలపై దేశవ్యాప్తంగా అమితాసక్తి నెలకొంది.

ఇక యావత్తు దేశం దృష్టిని ఆకట్టుకున్న రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలుస్తోంది. తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ రాజకీయ తెరంగేట్రం చేయడంతో పాటుగా గెలుపు దిశగా ఆయన సాగుతున్నారన్న కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో తమిళనాడు అసెంబ్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మెజారటీ సర్వే సంస్థలు అదికార డీఎంకేనే మరోమారు విజయం సాధిస్తుందని చెప్పిన నేపథ్యం… విజయ్ విజయావకాశాలపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

అయితే అటు డీఎంకేతో పాటు అన్నాడీఎంకేలు రాష్ట్రానికేమీ చేయలేదని చెప్పిన విజయ్… తనకు ఓ అవకాశం ఇవ్వాలని చేసిన వినతి తమిళ ఓటర్లను ఆలోచింపజేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెరసి విజయ్ ఈ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

ఇక కేరళ విషయానికి వస్తే… అక్కడ పదేళ్ల పాటు ఎల్డీఎఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కమ్యూనిస్టు నేత పినరయి విజయన్ నడిపిస్తున్నారు. వరుసగా రెండు సార్లు సీఎంగా పనిచేసిన పినరయిపై ఓ మోస్తరు వ్యతిరేకత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేరళలో ఎప్పటికప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించకుంటూ సాగుతున్న బీజేపీ… ఈ దఫా బోణీ చేయాల్సిందేనన్న గట్టి పట్టుదలతో పనిచేసిందని చెప్పాలి.

మరోవైపు పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న యూడీఎఫ్ కూడా ఈ దఫా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వెరసి పినరయికి మరో అవకాశం దక్కుతుందా?… లేక పాత సంప్రదాయం ప్రకారం యూడీఎఫ్ గద్దెనెక్కుతుందా? అన్నది రేపటితో తేలిపోనుంది. అసోం, పుదుచ్చేరిల్లో అధికార బీజేపీ మరోమారు సత్తా చాటడం ఖాయమేనన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో విజయం ఎవరిదన్న విషయంపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నట్లు సమాచారం. తమిళనాడులో అధికార డీఎంకే మరోమారు విజయ తీరాలకు చేరుతుందంటూ భారీ ఎత్తున బెట్టింగులు కాసినట్లు సమాచారం. అదే సమయంలో విజయ్ గెలుస్తారని కూడా భారీగా పందేలు కాసినట్లు తెలుస్తోంది.

ఇక బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ లకు సరిసమానంగా బెట్టింగులు జరుగుతున్నట్లు వినికిడి. బెట్టింగులపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించిన నేపథ్యంలో బెట్టిబగులను ఆయా వ్యక్తులు అత్యంత రహస్యంగా సాగిస్తున్నారు. ఇందుకోసం ఫోన్ కాల్స్ లేకుండా ఆన్ లైన్ వేదికగా బెట్టింగులను నిర్శహిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ ఫలితాలతో పాటు పుదుచ్ఛేరి ఫలితంపైనా ఓ మోస్తరు బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం.

This post was last modified on May 3, 2026 10:46 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

37 seconds ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

3 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

3 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

5 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

7 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

7 hours ago