సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే జూన్ 12 జరగాలి. కానీ ఇప్పుడు పలు రిస్కులు లెక్క వేసుకునే పనిలో సన్ పిక్చర్స్ టీమ్ ఉన్నట్టు సమాచారం. వాటిలో మొదటిది పోటీ. జూన్ 4 పెద్ది రిలీజవుతోంది. ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రీ టాక్ ఆ స్థాయిలో ఉంది. ట్రైలర్ గట్రా వచ్చాక అంచనాలు పెరుగుతాయని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి జైలర్ 2 కనీసం అరవై కోట్ల బిజినెస్ ఆశిస్తోందని ట్రేడ్ సమాచారం. కానీ పెద్దికి కేవలం వారం గ్యాప్ లో వచ్చి ఇంత రికవర్ చేసుకోవడం అంటే మాటలు కాదు. గ్రాస్ వంద కోట్లు దాటేయాలి. కూలికి యాభై కోట్లు పెట్టి కొంటే పూర్తి రికవరీ కాలేదు. దానికి నెల్సన్ కన్నా లోకేష్ కనగరాజ్ పెద్ద దర్శకుడు. అయినా తేడా కొట్టింది. జైలర్ 2 మీద కాంబినేషన్ క్రేజ్ కన్నా ఎక్కువగా కంటెంట్ మీద గురి ఉంది. అందుకే అంతేసి రేట్లు చెబుతున్నారు.
ఒకవేళ జూన్ వద్దనుకునే పక్షంలో జైలర్ 2 ఆగస్ట్ కు వెళ్లాల్సి ఉంటుంది. జూలై మీద అంత సుముఖత లేదని వినిపిస్తోంది. ప్రస్తుతానికి కోలీవుడ్ వర్గాలు జూన్ కే వస్తుందనే రీతిలో చెబుతున్నాయి. గతంలో జైలర్ వచ్చిన టైంలో భోళా శంకర్ రిలీజయ్యింది. అయితే దానికి ముందు నుంచే డిజాస్టర్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది కలగలేదు. కానీ పెద్దితో క్లాష్ అలా ఉండదు. అందుకే జైలర్ 2కి అరవై కోట్లనగానే పరిగెత్తుకుని వెళ్లే టాలీవుడ్ నిర్మాతలు ప్రస్తుతం లేరట.
ఫ్యాన్స్ మాత్రం జైలర్ 2 కి సోలో రిలీజ్ కోరుకుంటున్నారు. ఆగస్ట్ లో ఇండిపెండెన్స్ డే అయితే అన్ని రకాలుగా సేఫ్ బెట్ అవుతుందని వాళ్ళ ఫీలింగ్. షారుఖ్ ఖాన్ క్యామియో డ్రాప్ అయ్యాక దాన్ని ఎలా మేనేజ్ చేశారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. శివరాజ్ కుమార్ ఉన్నారు కానీ మోహన్ లాల్ చేశారా లేదానేది టీమ్ గుట్టుగా ఉంచుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న జైలర్ 2 ఈసారి వెయ్యి కోట్లను అందుకుంటుందని ఎప్పటిలాగే చెన్నై మీడియా రాగాలు పాడుతోంది.
This post was last modified on May 3, 2026 9:10 pm
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…