Political News

చాట్ జీపీటీతో ట్రాన్స్ ఫర్ ఆర్డర్..!

మనిషి తన పనులను మరింత సులభతరం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ సాగుతున్నాడు. అయితే అదే సాంకేతికతను వినియోగించి అక్రమార్కులు కూడా స్వైర విహారం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఏపీలో గురువారం ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని కొందరు అక్రమార్కులు చాట్ జీపీటీ టెక్నాలజీని వినియోగించి ట్రాన్స్ ఫర్ చేశారు. వారి మాట నమ్మి ఆ బదిలీ ఉత్తర్వులను తీసుకుని వెళ్లిన సదరు ఉద్యోగి… ఆ ఉత్తర్వు నకిలీదని తెలుసుకుని అవాక్కయ్యారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన రమణమ్మ కడప జిల్లాలోని గాలివీడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. దూరాభారాన్ని తగ్గించుకునే క్రమంలో గాలివీడు నుంచి తనకల్లుకు బదిలీ కోసం యత్నించారు. అందులో భాగంగా రమణమ్మ భర్త జయచంద్ర తనకు తెలిసిన పలక వేణును సంప్రదించారు. వేణు తన కుమారుడైన పలక గంగాద్రితో కలిసి పెద్ద స్కెచ్చే వేశారు. వేణు, గాంగాద్రిలిద్దరూ కలిసి అధునాతన సాంకేతికతను వినియోగించి నకిలీ బదిలీ ఉత్తర్వులను సృష్టించారు.

రమణమ్మ వివరాలను చాట్ జీపీటీలో ఎంటర్ చేసిన వేణు, గంగాద్రిలు… ఆమెను కడప జిల్లాకు చెందిన గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులోని ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ఏఐ టూల్ ను వినియోగించిన చాట్ జీపీటీ రమణమ్మ బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని వారిద్దరూై జయచంద్రకు అందజేశారు. అచ్చుగుద్దినట్టు ఒరిజినల్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ లానే ఉన్న సదరు ప్రతిని పట్టుకుని రమణమ్మ తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.

రమణమ్మ అందించిన బదిలీ ఉత్తర్వులను చూసిన తనకల్లు వైద్యాధికారులు… దానిని పరిశీలించి అది నకిలీ ఆర్డర్ అని తేల్చేశారు. హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి తమకు ఉత్తర్వులేమీ రాని నేపథ్యంలో రమణమ్మ అందించిన ఉత్తర్వులను వారు నకిలీదిగా తేల్చారు. దీనిపై వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించి మోసం జరిగిందని గుర్తించిన పోలీసులు… వేణు, గంగాద్రిని అరెస్ట్ చేశారు. బదిలీ కావాలంటే సంబందిత అధికారులను కలవాల్సింది పోయి ఇలా మధ్యవర్తులను కలవడమేమిటని వారు బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on April 30, 2026 5:46 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

31 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

1 hour ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago