Movie News

ప్యారడైజ్ పాట రాకపోతే..

ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో ‘దసరా’ తర్వాత రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి ప్రతి ప్రోమోతోనూ ఈ సినిమా క్యూరియాసిటీ పెంచుతూ వస్తోంది. సినిమా మొదలైనపుడు ఈ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఆ డేట్‌ను అందుకోవడం కష్టమై ఆగస్టు 21కి సినిమాను వాయిదా వేశారు.

కానీ ఈ మధ్య కొత్త డేట్ మీదా అనుమానాలు మొదలయ్యాయి. షూట్ మళ్లీ అనుకున్న ప్రకారం జరగట్లేదని.. బడ్జెట్ హద్దులు దాటిపోవడం సమస్యగా మారిందని.. దీంతో మరోసారి సినిమా వాయిదా పడబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు 2026లో ఈ సినిమా రిలీజే కాదనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా ఈ మేరకు జోరుగా వార్తలు వస్తున్నా సరే.. టీం సైలెంటుగా ఉంది. ఈ ప్రచారాన్ని ఖండించకపోవడంతో నిజంగానే సినిమా వాయిదా పడబోతోందని అనుమానిస్తున్నారు నాని ఫ్యాన్స్.
ఐతే ఇంకొన్ని రోజులు టీం మౌనం వహిస్తే వాయిదా ఖాయమని ఫిక్సయిపోవచ్చు.

నిజానికి ‘ది ప్యారడైజ్’ నుంచి రెండో పాట మే రెండో వారంలో రిలీజ్ కావాల్సి ఉంది. ఇంతకుముందు సినిమా నుంచి రిలీజ్ చేసిన తొలి పాట ‘ఆయా షేర్’ ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఈసారి మూవీ నుంచి లవ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని కొన్ని రోజుల ముందు వార్తలు వచ్చాయి. ఒకవేళ చెప్పిన ప్రకారమే రెండో పాటను రిలీజ్ చేశారు అంటే.. ‘ది ప్యారడైజ్’ వాయిదా లేనట్లే భావించవచ్చు.

పాట రిలీజ్ చేశారు అంటే.. దాాంతో పాటే రిలీజ్ డేట్‌ను ఖరారు కూడా చేస్తారనడంలో సందేహం లేదు. డేట్ లేకుండా పాటను లాంచ్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటిదాకా ‘ది ప్యారడైజ్’ టీం సైలెంటుగా ఉన్నప్పటికీ.. త్వరలో ఏదో ఒక క్లారిటీ వచ్చేయడం ఖాయం. రెండో పాటు చెప్పినట్లుగా రిలీజ్ చేయలేదంటే సినిమా వాయిదా పడబోతోందని ఫిక్సయిపోవచ్చు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు.

This post was last modified on April 30, 2026 3:42 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

12 hours ago