వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించడం అందరికీ తెలిసిందే. తరచుగా ఎక్కడ అవకాశం ఉన్నా.. చంద్రబాబు ఆయనపై నిప్పులు చెరుగుతుంటారు. అయితే.. పంచ్ డైలాగులు మాత్రం పెద్దగా మనకు కనిపించవు. తాజాగా జగన్‌పై చంద్రబాబు పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. పార్టీలో నూతన నాయకత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు వైసీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్‌ను ఇలానే వదిలేస్తే.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓసీడీ అనేది ఒక వ్యాధి. జగన్‌కు ఈ వ్యాధి పట్టుకుంది. ఆయనను ఇలానే వదిలేస్తే.. రేపు దేశానికి స్వాతంత్రం కూడా తానే తెచ్చానని చెబుతాడు. అంతేకాదు.. ఆపరేషన్ సిందూర్‌కు ఆయుధాలు అందించిందికూడా తానేనని ప్రచారం చేసుకుంటాడు. ఇది అత్యంత ప్రమాదకర వ్యాధి. దీనిని వ్యాపింపచేయకుండా జాగ్రత్తలు పాటించాలి. జగన్ నిర్వాకాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి“ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. జగన్‌కు వచ్చిన వ్యాది.. గొడ్డలి పార్టీలో అందరికీ వ్యాపిస్తోందని.. ఇది కరోనా కంటే వేగంగా ఉందని చంద్రబాబు పంచ్ రువ్వారు. ఫేక్ ప్రచారం.. ఫేక్ నేతలు.. అంటూ కామెంట్లు కుమ్మేశారు. ఏ విషయంలో అయినా.. మనకే అనుమానం వచ్చేలా చేయడంలో గొడ్డలి పార్టీ ముందుంటుంది అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సైకో పార్టీ, కిల్లింగ్ పార్టీ, గొడ్డలి పార్టీ అంటూ పదే పదే చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నవ్వుల్లో మునిగిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates