Political News

ఇలా చేస్తే ఆంధ్రా యూనివర్సిటీ పరువు ఏం కావాలి?

కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి చారిత్రక కార్యక్రమాన్ని నిర్వహించే వేళ.. తెలుగు భాష విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అందుకు భిన్నంగా అధికారుల నిర్లక్ష్యంతో పాటు.. విశ్వవిద్యాలయానికి చెందిన వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వందేళ్ల ఉత్సవాల సందర్భంగా అతిథులకు స్నాక్ బాక్స్ లను పంపిణీ చేశారు. దీనిపై ముద్రించిన తెలుగు పదాల్లోని దోషాలను చూసిన భాషాభిమానులు అవాక్కు అయ్యారు. సోమవారం విశాఖ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన గెస్టులకు స్నాక్ బాక్స్ లను అందించారు. ఈ బాక్స్ పై శతాబ్ది ఉత్సవాల వివరాలతో కూడిన స్టిక్కర్ అంటించారు. దానిపై వందేళ్ల వెలుగు.. తరాల ప్రగతికి అడుగు అన్న నినాదాన్ని ఖూనీ చేసేలా అక్షర దోషాలతో తయారు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

‘వందేళ్ల’ అన్న దానికి వండేళ్ళ అని.. వెలుగు అనే పదానికి బదులుగా వేలుగు అని.. తరాలు అన్న సులువుగా రాసే వీలున్న పదాన్ని త్రరాలుగా ప్రింట్ చేయటం చూస్తే.. తెలుగు భాష మీద వారికున్న గౌరవ మర్యాదలు ఇట్టే అర్థమైపోతాయి. ఈ స్నాక్ బాక్స్ ను తయారు చేసే పనిని విశాఖలోని ఒక హోటల్ కు ఏయూ అధికారులు అప్పగించినట్లుగా తెలుస్తోంది.

వారి ఘనకార్యంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలకు సిద్ధం చేసే ప్రతి అంశాన్ని ఏయూ అధికారులు నిశితంగా పరిశీలించి ఉంటే.. ఈ తప్పులు కనిపించేవని.. వాటిని సరిదిద్దే అవకాశం ఉండేదని చెబుతున్నారు. తెలుగు భాష పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు? అన్న విమర్శ పలువురు సంధిస్తున్నారు.

This post was last modified on April 29, 2026 12:46 pm

Share

Recent Posts

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

2 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

2 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

3 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

3 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

4 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

4 hours ago