సినీ రంగంలో ఒకరు చేయాల్సిన పాత్ర ఇంకొకరికి వెళ్లడం చాలా కామన్ విషయం. కొన్నిసార్లు కొందరు ఆర్టిస్టులను ఎంచుకుని, వారు ఆ పాత్రలకు సూట్ కారని పక్కన పెడుతుంటారు. ఇంకొన్నిసార్లు ఆర్టిస్టులే తమ దగ్గరికి వచ్చే పాత్రలకు నో చెబుతుంటారు. ఇలా ‘నో’ చెప్పిన పాత్రలు క్లిక్ అయితే, సదరు సినిమాలు భారీ విజయాలను అందుకుంటే మామూలు బాధ ఉండదు.
కెరీర్లే మారిపోయే పాత్రలను రిజెక్ట్ చేశామన్న అసంతృప్తి ఎప్పటికీ అలా ఉండిపోతుంది. తనకూ అలాంటి బాధ ఉందని అంటోంది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.
‘జాతిరత్నాలు’ చిత్రంలో చిట్టి పాత్రతో మంచి గుర్తింపు సంపాదించిన ఫరియాకు.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’లో తేజ సజ్జ సరసన నటించే అవకాశం వచ్చిందట. ఐతే ఆ సినిమాను తిరస్కరించడం తన కెరీర్లో చేసిన అతి పెద్ద తప్పిదం అని అంటోంది ఫరియా.
‘జాతిరత్నాలు’ చిత్రంలో మంచి పేరు వచ్చాక.. అప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టాను కాబట్టి తన వద్దకు వచ్చే పాత్రల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అనుకున్నానని.. ఈ క్రమంలోనే ‘హనుమాన్’ సినిమాలో కథానాయిక పాత్రను తిరస్కరించానని ఫరియా చెప్పింది.
ఆ సమయంలో తనకు బ్రెయిన్ లేదని.. సరిగా ఆలోచించే శక్తి లేక.. హనుమాన్ సినిమా ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోలేక ఆ పాత్రను వదులుకున్నానని ఆమె అంది. ఇప్పటికీ ఎక్కడైనా తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కలిస్తే మీ సినిమా చేయలేకపోయాను అంటూ ఫీలవుతుంటానని ఫరియా చెప్పింది.
ఫరియా నో చెప్పడంతో ఆ అవకాశం తమిళ కథానాయిక అమృత అయ్యర్‌కు వెళ్లింది. కాకపోతే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయినా.. అమృతకేమీ పెద్దగా పేరు రాలేదు. తన కెరీర్లో గొప్ప మార్పేమీ కనిపించలేదు. ఒకవేళ ఫరియా నటిస్తే తన కెరీర్‌కు ఆ పాత్ర పెద్ద బూస్ట్ ఇచ్చేదేమో.2024 సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 29, 2026 2:29 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…