Political News

చంద్ర‌బాబు వ‌ల్లే ఏపీకి మంచి రోజులు

ఏపీకి చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌డం.. ఇక్క‌డి ప్ర‌జ‌లు చేసుకున్న అదృష్ట‌మ‌ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ కొనియాడారు. ఆయ‌న వ‌ల్లే ఏపీకి మంచి రోజులు వ‌చ్చాయ‌న్నారు. త్వ‌ర‌లోనే విశాఖ‌ప‌ట్నం.. ఐటీ ప‌ట్నం కానుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. విశాఖ‌లోని త‌ర్లువాడ‌లో గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి శంకుస్థాప‌న చేసేందుకు వ‌చ్చిన ఆయ‌న‌.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనంత‌రం.. నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌ల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

ఒక న‌గ‌రాన్ని నిర్మించారు!

సీఎంగా చంద్ర‌బాబు ఒక న‌గ‌రాన్నే నిర్మించార‌ని అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్నప్పుడు సైబ‌రాబాద్ న‌గ‌రాన్ని నిర్మించిన విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. ఐటీ అభివృద్ధిలో ఈ న‌గరం కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని అన్నారు. అంతేకాదు.. భారీ ఆదాయాన్ని కూడా తీసుకువస్తుందని తెలిపారు. బాబు విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని.. ఆయ‌న‌కు సెల్యూట్ చేస్తున్నాన‌ని వైష్ణ‌వ్ పేర్కొన్నారు. అంతేకాదు.. దేశం గ‌ర్వించే నాయ‌కుడ‌ని చంద్ర‌బాబు కొనియాడారు.

లోకేష్ ఎన‌ర్జీ.. అద్భుతం!

మంత్రి నారా లోకేష్‌పైనా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ప్ర‌శంస‌లు కురిపించారు. యువ నాయ‌కుడిగా నారా లోకేష్ ఎన‌ర్జిటిక్‌గా ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో అద్భుతంగా ప‌నిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. సమస్యల పరిష్కారంలో యువనేతలకు లోకేశ్ ఆదర్శమని పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం.. నిరంత‌రం త‌పిస్తున్న సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌ను పుణికిపుచ్చుకున్నార‌ని తెలిపారు.

త‌న‌ను అనేక సంద‌ర్భాల్లో నారా లోకేష్ ఢిల్లీలో క‌లిశార‌ని.. ఎప్పుడూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పైనే ఆయ‌న చ‌ర్చించార‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు.. సీఎంగా చంద్ర‌బాబు, మంత్రిగా లోకేష్ నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని అన్నారు. ఇలాంటి నాయ‌కులు ఉన్న ఏపీ.. ప్ర‌జ‌లు ఎంతో అదృష్ట వంతుల‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే ఏపీ దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా పోటీ ఇవ్వ‌గ‌ల స్థాయికి చేరుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని తెలిపారు.

This post was last modified on April 28, 2026 2:53 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

37 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago