Movie News

పోకిరి ప్రభంజనానికి 20 సంవత్సరాలు

అదేదో నిన్నా మొన్నా చూసినట్టు ఉంది మహేష్ బాబు అభిమానులకు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 28 బాక్సాఫీస్ కు సునామి అంటే ఎలా ఉంటుందో పోకిరి రూపంలో పరిచయమయ్యింది ఈ రోజే. అప్పటికే మహేష్ ని ఒక్కడుతో మాస్ కి దగ్గర చేసిన గుణశేఖర్ కన్నా పదింతలు పై స్థాయిలో ఊర మాస్ అంటే ఏంటో చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. దెబ్బకు రికార్డుల వర్షం ఎలా కురిపించాలో, టికెట్ కౌంటర్లను డబ్బులతో ఎలా ముంచెత్తాలో ఋజువు చేశారు.

2005. పోకిరి కథను మహేష్ బాబుకి వినిపించే టైంకి పూరి జగన్నాథ్ వరసగా నాలుగు యావరేజ్ లేదా ఫ్లాపుల్లో ఉన్నారు. తన సత్తా ఏంటో టాలీవుడ్ కు మరోసారి చూపించాలనే కసితో ‘ఉత్తంసింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ’ టైటిల్ తో నెరేషన్ ఇచ్చారు. నిజానికి ఇది పవన్ కళ్యాణ్ లేదా రవితేజతో తీయాలనేది పూరి ప్రాధమిక ఆలోచన కానీ పండుగాడు క్యారెక్టర్ మహేష్ కోసమే రాసిపెట్టి ఉంది. అందుకే అక్కడికి వెళ్ళింది. వినగానే ప్రిన్స్ ఫ్లాట్ అయిపోయాడు. పేరు మార్చమంటే పోకిరిగా ఛేంజ్ చేశారు.

    సూపర్ స్టార్ కృష్ణ అతిథిగా ప్రారంభమైన పోకిరి ఆ తర్వాత షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంది. మణిశర్మ ఇచ్చిన పాటలు సెట్స్ లోనే అందరితో డాన్సులు చేయించాయి. ప్రకాష్ రాజ్ పాత్ర, ఆశిష్ విద్యార్ధి క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరుకి మాస్ వావ్ అనేశారు. పండుగాడుగా మహేష్ డైలాగులు, మ్యానరిజం, తింగరి మాటలు థియేటర్లలో ఓ రేంజ్ లో పేలాయి. ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్, దేవదేవుడా పాట ఊరు వాడా మ్రోగిపోయాయి. కట్ చేస్తే కనివిని ఎరుగని రికార్డులతో పోకిరి అరాచకం సృష్టించింది.

    నెలల తరబడి పోకిరి మేనియా నుంచి మూవీ లవర్స్ బయటికి రాలేకపోయారు. మహేష్ బ్రాండ్ మాస్ లో ఎవరూ కదల్చలేనంత బలంగా పాతుకుపోయింది. ఇలియానా డేట్స్ కోసం నిర్మాతలు క్యూలో నిలబడ్డారు. వసూళ్ల లెక్కలు చూసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మతులు పోయాయి. ఎవడు కొడితే డైలాగు ఊతపదంగా మారిపోయింది. అలా చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న పోకిరి వచ్చి రెండు దశాబ్దాలు అవుతోందంటే కాలం ఎంత వేగంగా పరిగెడుతోందో అర్థం చేసుకోవచ్చు.

    This post was last modified on April 28, 2026 6:17 pm

    Share

    Recent Posts

    దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

    భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

    11 minutes ago

    405 అయినా సరే… తగ్గేదే లే!!

    వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

    28 minutes ago

    సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

    టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

    2 hours ago

    సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

    ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

    4 hours ago

    ఎన్టీఆర్… ఇలాగే ఉండాలి

    తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…

    4 hours ago

    చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

    విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

    5 hours ago