బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై ఇటీవల పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(కర్ణాటక) చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళా బిల్లుపై ఇటీవల చర్చల సందర్భంగా.. సూర్య మాట్లాడుతూ.. తెలంగాణ-ఏపీని పాకిస్థాన్‌ను విడగొట్టినట్టు విడదీశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే రాజకీయ దుమారం రేపాయి. తాజాగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మా ఎంపీలే లోక్‌సభలో ఉండి ఉంటే.. తేజస్వి సూర్య అనే వెధవతో ముక్కు నేలకు రాయించి క్షమాపణలు చెప్పించే వాళ్లం. అన్నారు.
అంతేకాదు.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు సూర్యపై పన్నెత్తు మాట కూడా అనలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్థాన్‌తో పోల్చిన వెధవపై ఒక్క మాట అనలేదంటే.. వారు తెలంగాణలో పుట్టిన వాళ్లేనా? అని ప్రశ్నించారు. సభలోనే ఉన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా 16 మంది రాష్ట్ర ఎంపీలు ఎవరూ దానిపై కనీసం పెదవి విప్పలేదన్నారు. అదే బీఆర్ ఎస్ సభ్యులు ఉండి ఉంటే.. సభలో రణరంగం సృష్టించేవారని చెప్పారు. తేజస్విని దిగివచ్చేలా చేశారని వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని బీఆర్ ఎస్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను కేసీఆర్ టార్గెట్ చేశారు. తెలంగాణను తీవ్రంగా దూషించినా.. పాకిస్థాన్‌తో పోల్చినా వీరు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు పౌరుషం లేదన్నారు. కాళేశ్వరంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అవాకులు చవాకులు మాట్లాడితే.. బీఆర్ ఎస్ సభ్యుడు సురేష్ రెడ్డి గట్టిగా బదులిచ్చారని.. ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారని అన్నారు. ఇలాంటి సంస్కృతి, తెలంగాణ వాదం బీఆర్ ఎస్ రక్తంలోనే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం దేశాన్ని కదలించామని పేర్కొన్నారు.
సోనియా రాజీ పడమన్నారు!
తెలంగాణ విషయంలో అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ తనను రాజీ పడాలని కోరారని కేసీఆర్ తెలిపారు. కానీ.. తాను రాజీ పడలేదన్నారు. ఎంతకైనా పోరాడుతకానీ.. తెలంగాణ బిడ్డల తరఫున రాజీ పడేది లేదని ముక్కుమీద గుద్దినట్టు చెప్పానని కేసీఆర్ గుర్తు చేశౄరు.
ఇక, రాష్ట్రంలోని సమస్యలపై ఆయన స్పందిస్తూ.. వ్యవసాయం నుంచి అన్ని రంగాల వరకు.. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టామని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకునే విషయంలోను, కూలగొట్టే విషయంలోనూ నెంబర్ 1గా ఉందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనే పరిస్థితిలో కూడా ఈ దౌర్భాగ్య ప్రభుత్వం లేదు. అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
This post was last modified on April 28, 2026 9:08 am
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…