Movie News

హీరో గారికి ఫ్యాన్స్ లేరు కానీ ఎలివేషన్లు కావాలి

ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒకట్రెండు హిట్లు పడగానే కొందరు హీరోలు చేసే అతి మాములుగా ఉండదు. తమకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ వచ్చేసిందని ఫీల్ అయిపోవడం.. కథల్లో భారీతనం, ఎలివేషన్లు కోరుకోవడం.. పారితోషికాలు పెంచేయడం.. ఇలా అతి చేసే హీరోలకు కొదవేమి లేదు ఇండస్ట్రీలో. ఒక ఊహా ప్రపంచం సృష్టించుకుని అందులో బతికేస్తుంటారు ఈ బాపతు హీరోలు.

తనక్కూడా అలాంటి హీరోనే తగిలాడని అంటున్నాడు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోయే గాయపడ్డ సింహం చిత్ర దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్. అతడికి ఇదే తొలి చిత్రం. మరి ఈ కథే చెప్పాడా.. వేరే స్టోరీ చెప్పాడా అన్నది క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఒక హీరోకు కథ నచ్చి కూడా అందులో ఎలివేషన్లు లేవు అన్న కారణంతో తనతో సినిమా చెయ్యలేదని వెల్లడించాడు కశ్యప్ శ్రీనివాస్.

సదరు హీరో మేనేజర్ తన దగ్గరికి వచ్చి, సారుకు కథ నచ్చింది కానీ, ఇందులో అభిమానులు కోరుకునే ఎలివేషన్లు లేవేంటి అని అభ్యంతర పెట్టినట్లు కశ్యప్ చెప్పాడు. ఐతే ఆ హీరోకు గతంలో కానీ.. ఇప్పుడు కానీ అసలు ఫ్యాన్స్ అన్నవాళ్లే లేరు అన్నది చేదు నిజం అని వ్యాఖ్యానించాడు కశ్యప్.

నిజంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అయితే.. ఎలివేషన్లు లేకపోతే తమకే ఏదోలా అనిపిస్తుందని.. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ లేని ఇలాంటి హీరోలు ఎలివేషన్లు కోరుకుంటే ఏం చెయ్యాలి అన్నట్లు మాట్లాడాడు కశ్యప్. కొందరు కొన్ని కథల వల్ల స్టార్లు అవుతారని.. కానీ ఆల్రెడీ స్టార్లు అయిపోయాం అనుకుంటేనే కష్టమని కశ్యప్ వ్యాఖ్యానించాడు.

ఇలాంటి హీరోలు వేరే జోన్లో బతుకుతుంటారని.. వాళ్ళతో మనం సినిమా చెయ్యలేని అతను తేల్చేశాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన గాయపడ్డ సింహం మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు.

This post was last modified on April 27, 2026 9:32 pm

Share

Recent Posts

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

10 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

2 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

2 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

3 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

6 hours ago